టిడిపి బుట్టలో జగన్‌పార్టీ: బిల్లుపై లాస్ట్‌మినట్లో ఉత్కంఠ

Chandrababu Naidu - YS Vijayamma
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అసెంబ్లీలో వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో విఫలం కావడమే కాకుండా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ బుట్టలో పడిపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. మూడు రోజుల క్రితం అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికా బిల్లును ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఆదివారం వరకు చర్చ సాగింది.

ఆదివారం రాత్రి వరకు సుదీర్ఘ చర్చ సాగింది. చర్చ తర్వాత బిల్లు త్వరగానే పాస్ అవుతుందని అధికార పార్టీ భావించింది. కానీ అనూహ్యంగా ఆఖరి నిమిషంలో తెలుగుదేశం పార్టీ బిల్లులో ప్రతిపాదించిన 12వ క్లాజుకు సవరణ చేయాల్సిందేనని పట్టుబట్టింది. జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని డిమాండ్ చేసింది. దీంతో సభాపతి ఓటింగ్‌కు అనుమతించారు. ఓటింగ్ సమయంలో మొదట వైయస్సార్ కాంగ్రెసు టిడిపితో కలిసి వచ్చేందుకు ఇష్టపడలేదు.

టిడిపి వర్గీకరణ సవరణకు మజ్లిస్, లోక్‌సత్తా, సిపిఐ, సిపిఎం ఇలా అన్ని పార్టీలు మద్దతు పలికాయి. మిగిలిన ప్రతిపక్ష పార్టీలు అన్ని టిడిపి సవరణ బిల్లుకు ఓటింగ్ సమయంలో చేతులు లేపినప్పటికీ వైయస్సార్ కాంగ్రెసు తటపటాయించింది. ఆ తర్వాత వారిలో వారు చర్చించుకొని చివరి నిమిషంలో ఒక్కసారిగా అందరూ లేచి టిడిపి సవరణకు మద్దతు పలికారు. దీంతో ముందస్తు ప్రణాళిక లేకపోవడం, అనుభవరాహిత్యం జగన్ పార్టీలో కనిపించింది.

టిడిపి ప్రవేశ పెట్టిన సవరణకు ఎంతగా మద్దతు పలకవద్దని నిర్ణయించుకున్నప్పటికీ తర్జన భర్జన అనంతరం మద్దతు పలుకక తప్పలేదు. అయితే విపక్షాల సవరణకు కావాల్సిన మెజార్టీ రాకపోవడంతో తిరస్కరించారు. ఓటింగులో 22 మంది సభ్యుల మెజార్టీతో ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ సవరణను తిరస్కరించింది. ప్రతిపక్షాలకు చెందిన 47 మంది సభ్యులు ఏకత్రాటిపైకి వచ్చి సవరణ చేయాలని పట్టుబట్టగా 69 మంది కాంగ్రెసు సభ్యులు వ్యతిరేకించారు. అనంతరం బిల్ పాస్ అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+