వెయ్యి కిమీ పూర్తైన బాబు పాదయాత్ర: మోకాళ్ల యాత్ర

Chandrababu Naidu
నిజామాబాద్/విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వస్తున్నా మీకోసం పాదయాత్ర సోమవారం వెయ్యి కిలోమీటర్లను పూర్తి చేసుకుంది. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న బాబు తన పాదయాత్రను అనంతపురం జిల్లా హిందూపురం నుండి ప్రారంభించారు. అవాంతరాల కారణంగా మధ్యలో మూడు రోజులు మినహాయించి బాబు తన యాత్రను కొనసాగిస్తున్నారు.

నిజామాబాద్ జిల్లాలో ఆరో రోజు ఆయన పాదయాత్ర కొనసాగుతోంది. జిల్లాలోని పెంటకుదురు వద్ద బాబు యాత్ర వెయ్యి కిలోమీటర్లకు చేరింది. బాబు యాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సమయంలో పలువురు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చి పాదయాత్రలో పాల్గొన్నారు. అంతపురం, కర్నూలు, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలలో బాబు యాత్ర చేశారు. ఇప్పుడు నిజామాబాద్‌లో ఉన్నారు. ఇప్పటి వరకు 26 నియోజకవర్గాల్లో ఆయన తిరిగారు.

కాగా చంద్రబాబు పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్బంగా విశాఖపట్నం జగదాంబ కూడలి వద్ద విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇంచార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ మోకాళ్ల యాత్ర చేశారు. ఈ యాత్రకు నియోజకవర్గం కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+