పేరెంట్స్ అప్పు తీర్చలేదని కొడుకును కొట్టి చంపాడు!

మూడు నెలలైనా తల్లిదండ్రులు అప్పు తీర్చలేదని వారి కుమారుడిని పనిలో తీవ్రంగా వేధించేవాడు. చిత్రహింసలు పెట్టాడు. రాత్రి కూడా సరిగా పని చేయలేదని సాకు చెప్పి బాలుడిని దారుణంగా కొట్టాడు. ఆ తర్వాత తల్లిదండ్రుల వద్దకు తీసుకు వెళ్లి తింటుండగా గొంతులో చికెన్ ముక్క విరిగిపోయిందని చెప్పి వారికి అప్పగించి వెళ్లాడు. తీవ్రంగా గాయపడ్డ బాలుడు సోమవారం ఉదయం మృతి చెందాడు.
తల్లిదండ్రులు గమనించగా బాలుడిపై తీవ్రమైన గాయాలు ఉన్నాయి. కొట్టారని భావించిన తల్లిదండ్రులు మురళి పైన పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. మురళి పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఆక్సిజన్ సిలిండర్ల డిసిఎం బోల్తా
హైదరాబాదులోని మెట్టుగూడ వద్ద ఈ రోజు ఉదయం ఆక్సిజన్ సిలిండర్లను తీసుకు వెళ్తున్న ఓ డిసిఎం బోల్తా పడింది. సిలిండర్లు రోడ్డుపై పడిపోయాయి. సిలిండర్ల నుండి ఆక్సిజన్ లీక్ అవుతోంది. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ సిబ్బంది వాహనాన్ని తప్పించారు.












Click it and Unblock the Notifications