ఈడికి రాసిచ్చా: విజయసాయి రెడ్డి, రేపు కోర్టుకు జగన్

అందులో భాగంగానే తనను విచారిస్తోందని, సేకరించిన స్టేట్‌మెంట్ వివరాలను సమన్వయపర్చే ప్రక్రియలో భాగంగా తనను పలు ప్రశ్నలు అడిగారన్నరు. ఈడి ప్రశ్నలు వేస్తే తాను లిఖిత పూర్వకంగా సమాధానాలు రాసిస్తున్నానని చెప్పారు. ఈ నెల 18వ తేదిన తాను మరోసారి విచారణకు హాజరవుతున్నట్లు చెప్పారు. ఈడి అధికారులు అడిగిన ప్రశ్నలకు తాను సవివరంగా సమాధానాలు చెబుతున్నానని, వారికి సహకరిస్తున్నానని చెప్పారు.
రేపు సిబిఐ కోర్టుకు జగన్
అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్ జగన్‌ను రేపు నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్డు ఎదుట హాజరుపర్చనున్నారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించే ప్రత్యేక న్యాయవాది మూడు రోజుల పాటు సెలవులో ఉన్నారు. మరోవైపు రేపటితో జగన్ ఆస్తుల కేసులో వైయస్ జగన్, నిమ్మగడ్డ ప్రసాద్, మోపిదేవి వెంకట రమణ, బ్రహ్మానంద రెడ్డి, ఓఎంసి కేసులో గాలి జనార్ధన్ రెడ్డి, రాజగోపాల్, శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మార్ కేసులో సునీల్ రెడ్డిల రిమాండ్ ముగియనుంది.
వారిని వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించాల్సి ఉంది. ప్రత్యేక న్యాయవాది సెలవులో ఉన్నందున వీడియో కాన్ఫరెన్సుకు అవకాశం లేదు. దీంతో జగన్‌తో సహా మిగిలిన వారిని అందర్నీ కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. ఇప్పటికే చంచల్‌గూడ అధికారులకు ఈ సమాచారాన్ని అందించారు.












Click it and Unblock the Notifications