తెలంగాణపై ఒత్తిడి: లాస్ట్ మినట్లో 7గురు ఎంపీల ఝలక్

Sushil Kumar Shinde
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏడుగురు పార్లమెంటు సభ్యులు చివరి నిమిషంలో అధిష్టానానికి చేయిచ్చారు. మంగళవారం పార్లమెంటులో ఎఫ్‌డిఐలపై చర్చ జరుగుతుంది. ఆ తర్వాత ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో టి-ఎంపీలను బుజ్జగించేందుకు కేంద్రమంత్రులు కమల్ నాథ్, సుశీల్ కుమార్ షిండేలు రంగంలోకి దిగారు. ఈ రోజు తమతో భేటీ కావాలని టి-ఎంపీలకు సూచించారు.

ఆఖరి నిమిషం వరకు ఎంపీలు వారితో భేటీకి వెళ్లేందుకే ఇష్టపడ్డట్లుగా కనిపించారు. ఎంపీల మాట తీరులో కూడా భేటీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించింది. అయితే అనూహ్యంగా లాస్ట్ మినట్‌లో భేటీకి వెళ్లేందుకు నిరాకరించారు. ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, సురేష్ షెట్కార్, మంత్రులు బలరాం నాయక్, సర్వే సత్యనారాయణలు మాత్రమే భేటీకి హాజరయ్యారు. దీంతో భేటీ అసంపూర్తిగా ముగిసింది.

కేవలం నలుగురే రావడంతో షిండే కూడా అందరూ వచ్చాక కలుద్దామని చెప్పి వెళ్లిపోయారు. కాగా ఎంపీలు ఒక్కసారిగా వ్యూహం మార్చుకోవడానికి గల కారణం అధిష్టానం పైన ఒత్తిడి తెచ్చేందుకే. ఎఫ్‌డిఐలపైన చర్చ జరిగే సమయంలో ఓటింగ్ కోసం వెళ్లాలంటే తమకు తెలంగాణపై స్పష్టమైన హామీ రావాల్సిందేనని వారు పట్టుబడుతున్నారు. డిసెంబర్ 9లోగా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

అధిష్టానంపై తాము వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నామని, ఇప్పటికిప్పుడు తాము ఏమీ మాట్లాడేది లేదని, తెలంగాణ విషయంలో పార్టీపై, కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు తాము చేస్తున్నామని, తమ వ్యూహమేంటో తర్వాత చెబుతామంటున్నారు. వారు పెద్దపల్లి ఎంపి వివేక్ ఇంట్లో భేటీ తర్వాత ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

కాగా ఈ రోజు మధ్యాహ్నం లోకసభలో ఎఫ్‌డిఐలపై చర్చ జరగనుంది. రేపు ఓటింగ్ నిర్వహిస్తారు. రాజ్యసభలోనూ ఇదే అంశంపై గురువారం చర్చ చేపట్టి శుక్రవారం ఓటింగ్ జరపనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+