తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిరణ్ సిఎం కాకుంటే వైయస్ జగన్ ఉండేవాడు: పెద్దిరెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Peddireddy Ramachandra Reddy
తిరుపతి: కిరణ్ కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి కాకుంటే వైయస్ జగన్ కాంగ్రెస్ పార్టీని వదిలేవారు కాదని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి దుస్థితి వచ్చేది కాదని మాజీమంత్రి, చిత్తూరు జిల్లా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కొనసాగించడాన్ని నిరసిస్తూ శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత తొలిసారిగా సోమవారం ఆయన తిరుపతికి వచ్చారు.

వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య అనుమతించారు, కానీ కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పెద్దలకు లేనిపోనివి చెప్పి ఓదార్పుయాత్రను అడ్డుకునేలా చేశారని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం పదవికోసం రాష్ట్రంలో పార్టీనే లేకుండా చేసే స్థాయికి తీసుకొచ్చారని విమర్శించారు. వైయస్ కుటుంబం పట్ల కిరణ్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారనే విషయాన్ని జగన్ ముందే పసికట్టి ఇక కాంగ్రెస్‌లో ఉండకూడదని వేరు పార్టీ పెట్టారని అన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కుర్చీ గురించేతప్ప పార్టీ గురించి, ప్రజల గురించి ఆలోచించలేదని ఆయన దుయ్యబట్టారు. కిరణ్‌కు ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం లేదన్నారు. నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభంనుంచే కిరణ్ తనను, తనతో సన్నిహితంగా ఉన్న ఆదికేశవులును రాజకీయంగా అణగదొక్కడానికి కుట్ర ప్రారంభించారని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు.

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరు నియోజకవర్గాన్ని లాక్కొని తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న పుంగనూరుకు తాను వెళ్లేలా చేశారన్నారు. అయినా అక్కడి ప్రజలు తనను ఆదరించారని, మెజారిటీతో గెలిపించారన్నారు. అధిష్ఠానం కిరణ్‌ను దించకపోతే ఎన్నికల్లో పార్టీకి డిపాజిట్లు దక్కవని చెప్పారు. త్వరలో భవిష్యత్ ప్ర ణాళికను ప్రకటిస్తానన్నారు.

English summary
Congress rebel MLA Peddireddy Ramachandra Reddy said that because of Kiran kumar Reddy, YS Jagan had deserted the Congress and floated YSR Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X