వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు డిమాండ్ చేశారు, మొదటి ఓటు మాదే: గాలి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gali Muddukrishnama Naidu
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణపై అఖిల పక్షానికి మొదట డిమాండ్ చేసింది తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడేనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు బుధవారం అన్నారు. ఈ నెల 28న తెలంగాణపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఈ రోజు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై టిడిపి స్పందించింది.

తెలంగాణపై అఖిల పక్షానికి మొదట డిమాండ్ చేసింది చంద్రబాబే అన్నారు. బిల్లు పెడితే తొలి ఓటు తెలుగుదేశం పార్టీదే అన్నారు. అఖిల పక్ష సమావేశాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలంగాణ తెలుగుదేశం ఫోరం చైర్మన్ ఎర్రబెల్లి దయాకర రావు చెప్పారు. ఈ నెల 28న అఖిల పక్ష సమావేశం అన్న కాంగ్రెసు పార్టీ భేటీలో తెలంగాణపై తన నిర్ణయాన్ని కూడా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకే

అఖిల పక్ష సమావేశం కాంగ్రెసు పార్టీ మరో డ్రామా అని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ న్యూఢిల్లీలో అన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకే అఖిల పక్షం అంటున్నారన్నారు. ఎఫ్‌డిఐల నుండి గట్టెక్కిన తర్వాత దానిని మర్చిపోతారన్నారు. అఖిల పక్షానికి ముందే తెలంగాణపై కాంగ్రెసు తన వైఖరిని వెల్లడించాలన్నారు. ఇప్పటికే అఖిల పక్షం పేరుతో కేంద్రం మూడుసార్లు నాటకాలు ఆడిందని ధ్వజమెత్తారు. రాష్ట్రం ఇవ్వాలనే ఆలోచన కాంగ్రెసుకు లేదన్నారు.

English summary
Telugudesam Party senior leader Gali Muddukrishnama Naidu said party cheif Nara Chandrababu Naidu has demanded first to all party meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X