మంత్రి పదవి సౌకర్యంగాలేదు, సిగ్గేస్తోంది: సిఎంపై డిఎల్

రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు నిర్దోషి అని మంత్రివర్గం చర్చించడమేమిటని ప్రశ్నించారు. తనకు వ్యక్తిగతంగా ఎవరితోనూ వైరం లేదని అయితే తప్పుడు నిర్ణయాలను మాత్రమే తాను ప్రశ్నిస్తున్నానని చెప్పారు. ధర్మాన ప్రసాద రావును సిబిఐ విచారణకు ఆమోదించవద్దన్న కేబినెట్ నిర్ణయం వెనుక మోటివేషన్ ఉన్నట్లుగా కనిపిస్తోందని డిఎల్ రవీంద్రా రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు.
ధర్మాన రాజీనామా, సిబిఐ విచారణ వ్యవహారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీసుకోవాల్సిన నిర్ణయాలు అన్నారు. వాటిని మంత్రులపై రుద్దడం ఏమిటని ప్రశ్నించారు. తనకు మంత్రి పదవి అంత సౌకర్యంగా లేదన్నారు. ప్రభుత్వం తీరు చూస్తే తనకు సిగ్గేస్తోందన్నారు. ధర్మాన ప్రసాద రావు పైన తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని చెప్పారు. కోర్టుకు వెళ్తే మంత్రులకు కష్టాలు తప్పవన్నారు.












Click it and Unblock the Notifications