అసలు రంగు తెలుస్తుంది: టిఎంపిలు, షర్మిలపై నిప్పులు

2009 డిసెంబర్ 9న పార్లమెంటులో ప్రకటించబడిన తెలంగాణను సాధించే దిశలో తాము ముందుకు వెళ్తున్నామని చెప్పారు. అఖిలపక్షంలో రాజకీయ పార్టీలు తమ వైఖరులను తెలియజేయాలన్నారు. అఖిల పక్ష ఏర్పాటుతో తమ ప్రయత్నాలు ఆగిపోవని, రాష్ట్ర ఏర్పాటు దిశగా పోరాటం కొనసాగుతుందని చెప్పారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాజకీయాలు పక్కన పెట్టి అఖిల పక్ష సమావేశాన్ని స్వాగతించాలన్నారు.
ఒక్క పార్టీ నుండి ఒక్కరినే పిలుస్తారని చెప్పారు. ఇప్పటి వరకు తెలంగాణపై తమ వైఖరి చెప్పని పార్టీలు ఇక తమ డ్రామాలు ఆపాలని, తప్పించుకోవడానికి చూడకుండా స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని సూచించారు. అఖిలపక్ష సమావేశ ఏర్పాటు ద్వారా తెలంగాణపై తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్నామన్నారు. పనిలో పనిగా వారు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిల పైనా మండిపడ్డారు.
పాలమూరు వర్సిటీ విద్యార్థుల పైన పోలీసుల లాఠీ ఛార్జీని ఖండిస్తున్నామని చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకంగా పార్లమెంటులో ప్లకార్డులు పట్టుకున్న వారు తెలంగాణలో యాత్ర చేస్తున్నారన్నారు. తెలంగాణను అణగదొక్కాలనుకుంటే మరోసారి మహబూబాబాద్ రిపీట్ అవుతుందని హెచ్చరించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై దౌర్జన్యం చేయడమేమిటన్నారు. ఉద్యమాన్ని అణిచి వేయాలనుకుంటే కుదరదన్నారు. ఏ హోదాలేని వ్యక్తి పాదయాత్రకు భద్రత ఎలా కల్పిస్తున్నారని ప్రశ్నించారు.
పార్టీలు తెలంగాణపై తమ వైఖరిని లిఖిత పూర్వకంగా చెప్పాలన్నారు. తెలంగాణలకు వలసలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తెలంగాణ కోసం కేంద్రం ఓ అడుగు ముందుకేసినందున తాము ఎఫ్‌డిఐల కోసం జరిగే ఓటింగులో పాల్గొంటామని చెప్పారు. తెలంగాణ అంశంపై అఖిల పక్షం ఏర్పాటు చేయాలన్న తమ ఒత్తిడి ఎట్టకేలకు ఫలించిందన్నారు.












Click it and Unblock the Notifications