వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోపిదేవితో జగన్ మాటామంతి: ధర్మానతో దూరం

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan - Dharmana Prasad Rao
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టై బుధవారం నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్డుకు హాజరైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కోర్టు అనుమతితో తన కుటుంబ సభ్యులతో గంట సేపు మాట్లాడారు. జగన్ కోర్టుకు వచ్చే కంటే గంట ముందే ఆయన సతీమణి వైయస్ భారతి రెడ్డి, ఆడిటర్ విజయ సాయి రెడ్డి చేరుకున్నారు. కోర్టు నిందితులకు రిమాండ్ విధించిన అనంతరం జగన్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

చంచల్ గూడ జైలు నుండి జగన్ బయటకు వచ్చే సమయంలో చిరునవ్వుతో అందరికీ అభివాదం చేశారు. అనంతరం కోర్టుకు వచ్చి అక్కడ కనిపించిన వారందరినీ పలకరించారు. ఆయన కంటే ముందే చేరుకున్న మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణను, ఇతరులను నవ్వుతూ పలకరించారు. మోపిదేవితో కరచాలనం చేశారు. అయితే మంత్రి ధర్మాన ప్రసాద రావుతో మాత్రం ఎడమొహం పెడమొహంగా కనిపించారు. అయితే గతంలో వచ్చినప్పుడు ధర్మానతో మాట్లాడటం గమనార్హం. అధికారి శ్యామ్యూల్‌తో రహస్యంగా మాట్లాడినట్లుగా తెలుస్తోంది.

అనంతరం కుటుంబ సభ్యులతో, విజయ సాయి రెడ్డితో కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత జైలు అధికారులు జగన్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. మిగిలిన నిందితులను కేసు విచారణ పూర్తి కాగానే జైలుకు తరలించారు. జగన్ తిరిగి జైలుకు చేరే వరకు రహదారి పూర్తిగా ఖాకీ మయమైంది.

మరోవైపు జగన్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ జగన్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకు వెళ్లారు.

English summary
YSR Congress party chief YS Jaganmohan Reddy has wishes former minister Mopidevi Venkata Ramana in CBI court premices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X