• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

...పార్టీని వీడితే తప్పేంటి? పంపిస్తే వెళతా: కావూరి ఫైట్

By Srinivas
|
Kavuri Sambasiva Rao
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో కొల్లేరు సమస్యపై అధికార పార్టీ పార్లమెంటు సభ్యుడు, ప్రతిపక్ష నేతలు ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్ర కేబినెట్లో అవకాశం దక్కక పోవడంతో ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు కాంగ్రెసు పార్టీపై అలకబూనిన విషయం తెలిసిందే. రాజీనామాకు సైతం సిద్ధమయ్యారు. ఎఫ్‌డిఐ ఓటింగు నేపథ్యంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్వయంగా ఫోన్ చేయడంతో లోకసభకు హాజరయ్యారు.

ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ ప్రధాని స్వయంగా ఫోన్ చేయడంతో సభకు హాజరయ్యానని, ఇదే ఆఖరు అని చెప్పారట. అయితే కాంగ్రెసుపట్ల అసంతృప్తితో ఉన్న ఆయన గతంలోనే తాను కొల్లేరు సమస్యపై ఉద్యమిస్తానని ప్రకటించారు. ఈ రోజు ఆయన కొల్లేరు నాయకులతో భేటీ అయ్యారు. ఉద్యమ కార్యాచరణపై చర్చించారు.

కొల్లేరు సమస్యపై ఉద్యమం చేయాలని తాను నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ నెలాఖరున ఆందోళన బాట పడుతామని, ఏలూరులో జాతీయ రహదారి, రైల్వే లైన్లను దిగ్బంధిస్తామని చెప్పారు. సమస్యను పరిష్కరించే వరకు తాము ఆందోళన విరమించమన్నారు. ఒకవేళ ప్రభుత్వం తమపై కాల్పులు జరిపినా తగ్గేది లేదన్నారు. అభయారణ్య పరిధిని మూడో కాంటు వరకు తగ్గించాలని డిమాండ్ చేశారు. కొల్లేరులో పెదయాగనమిల్లి రోడ్డును నిర్మించి తీరుతామని చెప్పారు.

ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి అందలమెక్కించి తనను పోస్టర్లు అంటించమని, స్లోగన్లు ఇవ్వమని చెబుతున్నారని విమర్శించారు. ఇది ఎంత వరకు సమంజసమన్నారు. తాను 45 ఏళ్లుగా కాంగ్రెసు పార్టీలో ఉన్నానని చెప్పారు. కొల్లేరు ఉద్యమానికి మంత్రి పదవికి సంబంధం లేదన్నారు. కాంగ్రెసుతో తమ కుటుంబానికి ఉన్న సంబంధం విడదీయరానిదన్నారు. విడదీసే పరిస్థితి వస్తే వేరే పార్టీలోకి వెళ్లే విషయం ఆలోచిస్తే తప్పేంటన్నారు.

తాను సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఈ నెల 28న జరిగే అఖిల పక్ష సమావేశానికి తనను కాంగ్రెసు ప్రతినిధిగా పంపితే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సభలు తెలంగాణ, సమైక్యవాదంతో వాయిదా పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే పార్టీని వీడితే తప్పేంటన్నారు.

కాంగ్రెసులో చేరేందుకు సిద్ధం

అధికారంలో ఉన్న కాంగ్రెసు ప్రభుత్వం కొల్లేరు సమస్యను పరిష్కరిస్తే తాను కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధమని తెలుగుదేశం పార్టీ కైకలూరు శాసనసభ్యుడు వెంకట రమణ శుక్రవారం చెప్పారు. కొల్లేరు సరస్సు పరిధిని తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమస్యను పరిష్కరిస్తే కాంగ్రెసు వైపుకు వెళ్తానన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

lok-sabha-home

English summary
Eluru MP Kavuri Sambasiva Rao is ready to face Congress government on Kolleru issue. Kaikaluru TDP MLA Venkata Ramana said he is ready to join in Congress if government solve Kolleru issue.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more