పిల్లలు చెప్తే వినట్లేదు: జగన్ పార్టీ కూతురిపై నన్నపనేని

Nannapaneni Rajakumari - Sudha
గుంటూరు: తెలుగుదేశం పార్టీ నేత నన్నపనేని రాజకుమారి, ఆమె కూతురు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత డాక్టర్ నన్నపనేని సుధలు గురువారం ఒకే ప్రాంతంలో తమ తమ పార్టీల సమావేశాలు నిర్వహించారు. నన్నపనేని టిడిపిలో ఉండగా ఆమె కూతురు సుధ ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లిన విషయం తెలిసిందే. తాను చెప్పినప్పటికీ తన కూతురు వినలేదని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిందని నన్నపనేని గతంలోనే వివరణ ఇచ్చారు.

తాను మాత్రం తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తి లేదని చెప్పారు. అయితే గురువారం గుంటూరు జిల్లాలోని వినుకొండ నియోజకవర్గంలో ఇద్దరు సమావేశాలు నిర్వహించారు. గతంలో రాజకుమారి కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహించిన వినుకొండలోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసేందుకు నన్నపనేని సుధ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వినుకొండలో గురువారం జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో టిడిపి తరఫున రాజకుమారి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున డాక్టర్ సుధలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న రాజకుమారి ఓవైపు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు వెళ్లిన సుధ ఓ వైపు ఉండటంతో వినుకొండ ప్రజలు వింతగా చూశారు.

కాగా పిల్లల భావాలు పిల్లలవని, పెద్దల మాట వినే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదని, తన కూతురు నన్నపనేని సుధ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లినప్పటికీ తాను మాత్రం తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని నన్నపనేని రాజకుమారి మరోసారి తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+