జపాన్‌ను తాకిన భారీ భూకంపం, సునామీ హెచ్చరిక

భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.4గా నమోదైంది. అది 7.3గా నమోదైనట్లు అమెరికాలో జియోలాజికల్ సర్వే మొదటి తెలిపింది. ఆ తర్వాత దాన్ని 7.4గా సవరించింది. నిరుడు మార్చి 11వ తేదీన ఇదే ప్రాంతాన్ని భూకంపం అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే.
జపాన్ తీర ప్రాంతాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఫుకుషిమా అణు విద్యుత్కేంద్రం సురక్షితంగానే ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఎత్తు ప్రదేశాలకు తరలి వెళ్లాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది. భూకంప తీవ్రతతో సముద్రపు అలలు పెద్ద యెత్తున ఎగిసి పడే అవకాశం ఉంది. హోన్షు దీవి కేంద్రంగా భూకంపం తాకింది.












Click it and Unblock the Notifications