అయ్యప్పమాల వేశా.. బెయిలివ్వండి: మోపిదేవి పిటిషన్

తాను పందొమ్మిదేళ్లుగా అయ్యప్ప మాలను యధావిధిగా వేస్తున్నానని, అలాగే ఈసారి వేశానని, శబరికి వెళతానని అనుమతించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నెల 24వ తేది నుండి వచ్చే నెల 2వ తేది వరకు తనకు అనుమతివ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.
కాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు ఆరుగురు మంత్రులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అందులో మోపిదేవి కూడా ఒకరు. ఈయనను వాన్‌పిక్‌కు సంబంధించిన కేసులో సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. ఈయన పలుమార్లు బెయిల్ కోసం సిబిఐ కోర్టులో, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. కానీ ఆయనకు పలుమార్లు చుక్కెదురయింది.
వాన్‌పిక్‌కు సంబంధించిన కేసులోనే మంత్రి ధర్మాన ప్రసాద రావు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈయనపై ఆరోపణలు రావడంతో అతను మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయనను విచారణనకు అనుమతించాల్సిందిగా సిబిఐ ప్రభుత్వాన్ని కోరింది. మంత్రివర్గం అందుకు నిరాకరించింది. ఈ ఫైలు ప్రస్తుతం గవర్నర్ నరసింహన్ వద్ద ఉంది. ఆయన ధర్మానను ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తారా లేదా అనే ప్రశ్న ఇటు ధర్మానను, మిగిలిన మంత్రులను తొలుస్తోంది.












Click it and Unblock the Notifications