అఖిలపక్షం తేది మార్చం: ముఖ్యమంత్రికి షిండే ఝలక్

అలాగే రాష్ట్రంలోని అన్ని పార్టీల నుండి తెలంగాణపై అభిప్రాయం చెప్పేందుకు ఒక్కరినే పిలవాలని వారు ఆయనకు విజ్ఞప్తి చేశారు. టి-ఎంపీల విజ్ఞప్తిపై ఆయన స్పందించారు. అఖిల పక్ష సమావేశం తేదిలో ఎలాంటి మార్పు లేదన్నారు. ఒకవేళ పార్టీలు అన్ని కోరితేనే తేదీని వాయిదా వేసే విషయాన్ని ఆలోచిస్తామని చెప్పారు. లేదంటే 28వ తేదినే ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతుందని, అన్ని పార్టీలకు ఆహ్వానాలు పంపిస్తామని చెప్పారు.
ఆయా పార్టీల నుండి ఎంతమంది వస్తారో వారిష్టమని షిండే చెప్పారు. తెలుగు మహాసభల దృష్ట్యా అఖిల పక్షం తేదీ మార్చాలన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తిని తోసి పుచ్చారు. టిఎంపిల కోరిక మేరకే అఖిల పక్షం అన్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకు సంప్రదింపులు కొనసాగుతాయన్నారు.
కాగా ప్రపంచ తెలుగు మహా సభల నేపథ్యంలో అఖిల పక్ష సమావేశాన్ని వాయిదా వేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. కిరణ్‌తో పాటు పలువురు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కూడా ఆల్ పార్టీ భేటీని వాయిదా వేయాలని కోరారు. మరోవైపు తెలంగాణ ప్రాంత నేతలు మాత్రం సమావేశాన్ని వాయిదా వేయవద్దని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఎంపీలు వెళ్లి షిండేను వాయిదా వేయవద్దని కోరారు.












Click it and Unblock the Notifications