70సీట్లు: కెసిఆర్‌కు హైదరాబాద్ భయం, సర్వేలోనూ..

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు హైదరాబాద్ భయం పట్టుకుందట. గత మూడేళ్లుగా తెలంగాణ ప్రాంతంలో తెరాస జోరు కొనసాగుతోంది. కాంగ్రెసు పార్టీ తెలంగాణ విషయంలో నిత్యం మోసం చేస్తోందని, దానికి బుద్ధి చెప్పి తెలంగాణ సాధించుకోవాలంటే ఈ ప్రాంతంలో ఎక్కువగా ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను తెరాసనే గెలుచుకోవాలనేది ఆయన వాదన.

అందులో భాగంగానే ఆయన కొన్నాళ్లుగా తనదైన శైలిలో వ్యూహరచన చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెరాస హవా కొనసాగుతుందని సర్వేలు కూడా చెబుతున్నాయి. దాదాపు 70కి పైగా తెరాస ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి. కెసిఆర్ ఆ లక్ష్యాన్ని వందగా పెట్టుకున్నారు. రాజధానిని మినహాయించి మిగిలిన జిల్లాలపై కెసిఆర్ గట్టి నమ్మకం పెట్టుకున్నారు.

తెలుగుదేశం, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీని కాదని తెరాస మంచి మెజార్టీతో ఎక్కువ సీట్లు సాధించుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయనకు ఇటీవల హైదరాబాద్ భయం పట్టుకుందట. తెలంగాణ కోసం మిగిలిన జిల్లాలు సరే.. కానీ తెలంగాణలోకే సొంతం అని కెసిఆర్ గొంతు చించుకుంటున్న హైదరాబాదులో తెరాస బలం ఏమిటనే ప్రశ్నను సీమాంధ్ర నేతలు సంధిస్తున్నారు.

కేవలం హైదరాబాదు మాత్రమే కాకుండా రంగారెడ్డి జిల్లాలో కూడా తెరాస ప్రభావం అంతగా లేదనే వాదన ఉంది. దీంతో కెసిఆర్ ఇప్పుడు హైదరాబాద్ పైన ప్రత్యేకంగా దృష్టి సారించాలనే నిర్ణయానికి వచ్చారట. 2004లో నగరంలో తెరాస రెండు చోట్ల గెలిచింది. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో ఉన్న వాటిని కూడా కోల్పోయింది. దీంతో 2014 సాధారణ ఎన్నికల నాటికి సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లను గెలుచుకోవాలని ఉవ్వీళ్లూరుతున్నారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+