కెవిపికి మాతృవియోగం: ఢిల్లీ నుండి బయల్దేరిన కెవిపి

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో కెవిపి రామచంద్ర రావు చక్రం తిప్పిన విషయం తెలిసిందే. కెవిపిని వైయస్ తన ఆత్మబంధువుగా చెప్పుకునే వారు. కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసు పార్టీ నుండి బయటకు వెళ్లి వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించిన తర్వాత ఆయన కృష్ణా జిల్లా ఓదార్పులో ఉన్నప్పుడు తన యాత్ర రూటును అకస్మాత్తుగా మార్చుకొన్న విషయం తెలిసిందే.
జగన్ తన దారిని మార్చుకొని అంబాపురం మీదుగా వెళ్లారు. అంబాపురంలో కెవిపి రామచంద్ర రావు ఇంటికి వెళ్లి ఆయన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కెవిపి ఇంటికి జగన్ హఠాత్తుగా వెళ్లడం, సీతాదేవి ఆశీర్వాదాలు తీసుకోవడం చర్చనీయాంశమయ్యాయి. సీతాదేవితో కాసేపు జగన్ ముచ్చటించారు.












Click it and Unblock the Notifications