తెలంగాణపై చర్చించం: బొత్స, ముళ్లకంప: టిజి వెంకటేష్

 Botsa Satyanarayana - TG Venkatesh
హైదరాబాద్: ఈ నెల 16వ తేదిన జరగనున్న కాంగ్రెసు పార్టీ సదస్సులో తెలంగాణ, సమైక్యాంధ్ర అంశంపై తాము చర్చించమని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం అన్నారు. ఈ రెండు అంశాలు చాలా సున్నితమైనవని, వాటిపై అధిష్టానం నిర్ణయం తీసుకునే ప్రయత్నాలు చేస్తోందన్నారు. తెలంగాణపై శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం యోచిస్తోందన్నారు.

వాటిపై రాష్ట్ర సదస్సులో చర్చించమన్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుండి ఆహ్వాన లేఖ అందిన తర్వాత ఈ నెల 28న జరగనున్న అఖిల పక్ష సమావేశానికి ఎవరిని పంపించాలనే విషయాన్ని తేల్చుతామన్నారు. సదస్సులో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లే అంశాలపై చర్చిస్తామని చెప్పారు.

ముఖ్యమంత్రి పదవి ఓ ముళ్లకంప

ముఖ్యమంత్రి పదవి ముళ్లకంప వంటిదని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ వేరుగా అన్నారు. కాంగ్రెసు పార్టీలో ముఖ్యమంత్రి పదవిపై ఆశపడే వారు ఎంతో మంది ఉన్నారని ఆయన అన్నారు. అయితే ఆ పదవి చాలా కష్టంతో కూడుకున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణపై వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు నిర్ణయం వెలువడుతుందన్నారు. తెలుగు మహాసభల్లో తెలంగాణపై చర్చించాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+