వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉరేసుకుని టెక్కీ ఆత్మహత్య, మాజీ ప్రేయసిపై కేసు

By Pratap
|
Google Oneindia TeluguNews

Software Engineer commits Suicide
పూణే: వానోవ్రీ పోలీసు స్టేషన్ పరిధిలో సతారాకు చెందిన ఓ 27 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ డిసెంబర్ 2వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్యాన్‌కు ఉరేసుకుని అతను మరణించాడు. మృతుడిని వానోవ్రీలోని భైరోబానాలో గల పంచరత్న అపార్టుమెంటులో నివసించే ప్రవీణఅ భానుదాస్ గిర్హేగా గుర్తించారు. అతను హదప్సార్‌లోని ఐటి కంపెనీలో పనిచేస్తున్నాడు.

ప్రవీణ్ మాజీ ప్రియురాలు కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీరే. ప్రవీణ్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణపై ఆమె మీద, ఆమె ఫ్రెండ్ మీద పోలీసులు కేసు పెట్టారు. గిర్హె ఫ్లాట్‌లో రెండు సూసైడ్‌ నోట్స్ దొరికాయని, దాని ఆధారంగా ఇద్దరిపై కేసు నమోదు చేశామని పోలీసులు అంటున్నారు. తన ఆత్మహత్యకు తన గర్ల్ ఫ్రెండ్, ఆమె ఫ్రెండ్ కారణమని గిర్హే తన సూసైడ్ నోట్‌లో రాశాడు.

మహిళా టెక్కీ, గిర్హే కొంత కాలం సంబంధం కొనసాగించారు. కొన్ని నెలల తర్వాత ఆమె సంబంధం తెంపుకుంది. నగరం వదిలేసి వెళ్లిపోవాలని, లేదంటే తనను తన మాజీ ప్రేయసి, ఆమె ఫ్రెండ్ తనను చంపుతామని బెదిరించారని గిర్హే తన సూసైడ్ నోట్‌లో రాశాడు. వీరంతా ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. ఒత్తిడి తట్టుకోలేక గిర్హే ఆత్మహత్య చేసుకున్నాడు.

సతారా అంత్యక్రియలు చేసిన తర్వాత గిర్హే సోదరుడు ప్రదీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రమాదవశాత్తు జరిగిన మృతి కింద కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A 27-year-old software engineer from Satara, who was working in a Hadapsar-based firm, allegedly committed suicide by hanging himself from the ceiling fan in his flat at Wanowrie on December 2.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X