హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోతికి కొబ్బరి చిప్ప: జగన్ పార్టీపై రేవంత్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Revanth Reddy
హైదరాబాద్: ఎఫ్‌డిఐలపై రాజ్యసభలో ఓటింగుకు తమ పార్టీ ఎంపిలు గైర్హాజరు కావడంపై కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజ్యసభలో ఓటింగుకు గైర్హాజరు కావడంపై తమ పార్టీ ఎంపీలు ఇప్పటికే వివరణ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. దానిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు రాద్దాంతం చేయడం సరి కాదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

పార్లమెంటులో బాహాటంగా జరిగిన దానిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసుకు ప్రత్యామ్నాయంగా కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన పార్టీ తమదని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీ సభ్ ప్లాన్‌పై వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఒక దృక్పథమే లేదని ఆయన అన్నారు. శాసన మండలిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు నలుగురు, విధానాలు మూడు అని ఆయన వ్యాఖ్యానించారు.

తెలిసీ తెలియని వ్యాఖ్యలతో తమ పార్టీపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓ విలువలకు కట్టుబడి యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి ఓటేశారని ఆయన అడిగారు. తెలంగాణ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుక్కునే చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వానికి లేదని ఆయన విమర్శించారు.

అఖిల పక్ష సమావేశం పెట్టించడానికి ఒత్తిడి పెట్టిన కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు తెలంగాణ సమస్య శాశ్వత పరిష్కారానికి కూడా ఒత్తిడి తేవాలని ఆయన సూచించారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఓ ఎజెండాను పెట్టి అఖిల పక్ష సమావేశానికి రాజకీయ పార్టీలను పిలిస్తే పరిష్కారం దిశగా ప్రయాణం చేయవచ్చునని ఆయన అన్నారు.

తెలంగాణపై గందరగోళాన్ని కొనసాగించడానికే అఖిల పక్ష సమావేశానికి పార్టీ నుంచి ఇద్దరేసి ప్రతినిధులను ఆహ్వానించారని ఆయన అన్నారు. ఎంపిల విజ్ఞప్తి మేరకు అఖిలపక్ష సమావేశం పెడుతున్నామని అంటున్న కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. అఖిల పక్ష సమావేశానికి ఎంత మందిని పంపించాలని, ఎవరిని పంపించాలి అనే విషయాలపై పార్టీలో చర్చించి నిర్ణఁ తీసుకుంటామని ఆయన చెప్పారు.

English summary
Telugudesam MLA Revanth Reddy has lashed out at YS Jagan's YSR Congress party criticizing his party on the absence of 3 MPs from Rajyasabha during voting on FDIs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X