వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖలో ఎన్టీఆర్ విగ్రహానికి 'కాంగ్రెసు' పాలాభిషేకం

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు పాలాభిషేకం జరిపారు. ఎన్టీఆర్ తనయ, కేంద్రమంత్రి పురంధేశ్వరి విశాఖపట్నం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. విశాఖపట్నంకు చెందిన కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు నందమూరి తారక రామారావు విగ్రహానికి పట్టణంలో పాలాభిషేకం చేశారు. ఆ తర్వాత విశాఖ బీచ్ వద్ద ఉన్న ఈ విగ్రహం వద్ద హారంగా నిలబడి తమ నిరసనను తెలియజేశారు.

కాగా పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు అంశం నందమూరి కుటుంబంలో సెగ రేపిన విషయం తెలిసిందే. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహానికి పార్లమెంటరీ కమిటీ ఓకె చెప్పిందని, విగ్రహం ఇవ్వాలని స్పీకర్ మీరా కుమార్ కేంద్రమంత్రి పురంధేశ్వరికి ఇటీవల లేఖ రాసిన నేపథ్యంలో ఈ క్రెడిట్‌ను కొట్టేసేందుకు ఎవరికి వారే ప్రయత్నాలు చేశారు.. చేస్తున్నారు. తమ హయాంలోనే గ్రీన్ సిగ్నల్ వచ్చిందని పురంధేశ్వరి అడ్డుకున్నారని బాబు ఆరోపించారు.

NTR Statue

బాబు ఆరోపణలపై పురంధేశ్వరి స్పందించారు. బాబుకు కౌంటర్ ఇచ్చారు. పురంధేశ్వరి భర్త దగ్గుపాటి వెంకటేశ్వర రావు అయితే చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో హీరో బాలకృష్ణ రంగంలోకి దిగారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో అడ్డుకున్నప్పుడు ఏం చేశారని ఘాటుగా ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ ఓ అడుగు ముందుకేసి ఎన్టీఆర్ విగ్రహానికి అల్లుళ్లకు, పార్టీలకు సంబంధం లేదని చెప్పారు.

ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి కూడా తన సంతకం లేకుండా ఎలా ఏర్పాటు చేస్తారని, తాను ఎన్టీఆర్ సతీమణిని అని, పురంధేశ్వరి, చంద్రబాబులకు కామన్ సెన్స్ లేదని నిప్పులు చెరిగారు. పురంధేశ్వరిపై బాలయ్య చేసిన వ్యాఖ్యలపై ఎన్టీఆర్ పెద్ద తనయుడు జయకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
Even as family members of TD founder NT Rama Rao are engaged in a verbal duel over the installation of a life size statue of the late leader in Parliament House, Congress activists in Vishaka city on Wednesday performed abhishekam to the NTR's statue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X