గవర్నర్ కాంగ్రెసు ఏజెంట్: గాలి, ధర్మాన ఫైల్‌పైనా..

ధర్మాన రాజీనామా చేసి ఇంతకాలమైనా ఆ ఫైల్‌ను ఇంతవరకు చూడలేదని గవర్నర్ అనడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. అవినీతిపరుల్ని వెనకేసుకొస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని గవర్నర్ నరసింహన్ వెంటనే భర్త్‌రఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
వాన్‌పిక్ సంస్థకు భూములు కట్టబెట్టినట్లు స్పష్టమైనా ధర్మానను విచారించేందుకు సిబిఐకి ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వలేదని ముద్దు కృష్ణనాయుడు ప్రశ్నించారు.ధర్మానను సిబిఐ విచారించవద్దని కేబినెట్ ఆమోదించిన తీర్మానాన్ని వెంటనే రద్దు చేయాలని గాలి డిమాండ్ చేశారు.
కన్నెధార భూములతో పాటు ధర్మానపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని, అయినా ప్రభుత్వం ఆయనను వెనకేసుకువస్తుందని ఆయన దుయ్యబట్టారు. అలాగే 26 వివాదాస్పద జీవోలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు మంత్రులపై కూడా చర్యలు తీసుకోవాలని గాలి డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications