ప్రధానికి విజయమ్మ లేఖ: జైల్లో జగన్ కలిసిన కాసాని

ఎరువుల ధరను వెంటనే తగ్గించాలని లేఖలో ప్రధానికి విజయమ్మ విజ్ఞప్తి చేశారు. దేశ ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని, గడిచిన రెండేళ్లలో వరి కనీస మద్దతు ధర 25 శాతం పెరిగితే.. ఎరువుల ధరలు మాత్రం దాదాపు మూడు వందల శాతం వరకు పెరిగాయని విజయమ్మ పేర్కొన్నారు.
జగన్‌ను కలిసిన కాసాని
జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ శాసనమండలి సభ్యుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, జిహెచ్ఎంసి కాంగ్రెసు ఫ్లోర్ లీడర్ కాలేరు వెంకటేష్ శుక్రవారం కలిశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతున్న వైయస్ జగన్ వెంట తాము ఉంటామని వారు ఈ సందర్భంగా చెప్పారు.
తాను త్వరలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరతానని కాసాని జ్ఞానేశ్వర్ ఈ సందర్భంగా ప్రకటించారు. ఒకటి రెండు రోజుల్లో ఆ తేది ప్రకటిస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పాలనను మర్చిపోలేక పోతున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications