నాటు బాంబులు, రాళ్లు విసురుకున్న కాంగ్రెస్ వర్గాలు

ఈ రోజు కూడా కాంగ్రెసు పార్టీలోని ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. గ్రామం నుండి ఇరువర్గాల వారు పరారయ్యారు.
ఐదిళ్లలో చోరీ
హైదరాబాదులోని హయత్‌నగర్‌లోని బృందావనం కాలనీలో ఐదిళ్లలో దొంగతనం జరిగింది. గురువారం రాత్రి కాలనీలో తాళాలు పగులగొట్టి ఇళ్లలోకి చొరబడిన దొంగలు నగదు, నగలను దోచుకొని వెళ్లారు. శుక్రవారం ఉదయం బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇంజాపూర్‌లో దోపిడీ దొంగల బీభత్సం సృష్టించారు. ఓ వృద్దురాలి ఇంట్లోకి చొరబడి ఆమెను హత్య చేసి 15 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు.












Click it and Unblock the Notifications