ఆటలు సాగవనే, బాబుకు పాదయాత్ర ఎందుకు: షర్మిల

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని కానీ, ఎప్పుడూ ప్రజల పైన ఒక్క రూపాయి కూడా భారం వేయలేదన్నారు. చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే పరోక్షంగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోకుండా కాపాడుతున్నారన్నారు. అందుకే ఆయన ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టేందుకు ముందుకు రావడం లేదని షర్మిల ఆరోపించారు.
చంద్రబాబు అడుగుజాడల్లో కిరణ్ నడుస్తున్నారన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం గాలికొదిలేయగా.. ప్రధాన ప్రతిపక్షం కొమ్ముకాస్తోందన్నారు. బాబు తొమ్మిదేళ్ల పాలనలో రైతులందరూ అప్పుల ఊబిలో కూరుకుపోయి జీవచ్ఛవాల్లా తయారయ్యారన్నారు. వైయస్ అధికారంలోకి రాగానే రూ.12వేల కోట్ల రుణమాఫీ చేసి రైతన్నను అప్పుల ఊబి నుండి పడేశారన్నారు.
బాబు పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి పడగొట్టే శక్తి ఉన్నప్పటికీ ఆ పని చేయడం లేదన్నారు. జగన్ బయట ఉంటే తమ ఆటలు సాగవని కాంగ్రెసు, టిడిపిలు కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నాయని విమర్శించారు. జగన్ త్వరలో బయటకు వస్తాడని, సంక్షేమ రాజ్యం కోసం కృషి చేస్తాడని అన్నారు.












Click it and Unblock the Notifications