కుటుంబ కలహాలతో రైలు కిందపడి ఫ్యామిలీ ఆత్మహత్య

ఈ ఘటనలో వెంకటేష్ భార్య లక్ష్మి, కూతుళ్లు జయలక్ష్మి, మౌనికలు మృతి చెందారు. వెంకటేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతని ని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. వెంకటేష్ పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలియజేశారు. వీరి ఆత్మహత్యకు కుటుంబ ఘర్షణలే అని తెలుస్తోంది.
అత్తా కోడలు మృతి
పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ వద్ద కాలువలో దీపాలు వెలిగిస్తూ అత్తా కోడళ్లు ప్రమాదవశాత్తూ నీటిలో జారిపడ్డారు. విషయం తెలియడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు చేరుకొని వారి కోసం గాలించారు. అత్త మృతదేహం లభ్యమైంది. కోడలి కోసం గాలిస్తున్నారు.
లారీ ఢీకొని ఇద్దరు మృతి
కృష్ణా జిల్లాలో శుక్రవారం ఉదయం రోడ్డుపై నడిచి వెళ్తున్న వారిని ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికి అక్కడే మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications