నేను ఎమ్మెల్యేనే, నిర్ణయానికి కట్టుబడి ఉన్నా: ధర్మాన

జిల్లాలో ఇందిరమ్మ బాట కార్యక్రమానికి ఇన్‌చార్జి మంత్రిగా కాకుండా సీనియర్‌గా సలహాలు అందించడానికి మాత్రమే వచ్చానని చెప్పారు. తనను మంత్రిగానే భావిస్తున్న ప్రభుత్వం ప్రోటోకాల్‌ను యథాతథంగా కొనసాగిస్తుందని తెలిపారు. తన నిర్ణయంలో మార్పు వుంటే, పిలిచి మరీ చెబుతానని చెప్పారు.
సహచర మంత్రులు పి.బాలరాజు, గంటా శ్రీనివాసరావులు మాత్రం ధర్మాన ఇన్‌చార్జి మంత్రి హోదాలోనే ఈ సమావేశానికి హాజరైనట్టు చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో వాన్‌పిక్ వ్యవహారానికి సంబంధించి సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లో నిందితుడిగా చేర్చడంతో ధర్మాన ప్రసాదరావు మంత్రి పదవికి రాజీనామా చేశారు.
ధర్మాన ప్రసాదరావు రాజీనామాను ముఖ్యంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆమోదించలేదు. దాన్ని ఆమోదించాల్సిన అవసరం లేదని మంత్రి వర్గ సమావేశంలో తీర్మానం చేసి, దాన్ని ప్రభుత్వం గవర్నర్ నరిసంహన్‌కు చేర్చింది.












Click it and Unblock the Notifications