వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షర్మిల కాలికి గాయం: కలిసిన జగన్ సతీమణి భారతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Bharathi -Sharmila
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలను జగన్ సతీమణి వైయస్ భారతి రెడ్డి ఆదివారం పరామర్శించారు. కాలికి గాయం కావడంతో షర్మిల పాదయాత్రకు రెండు రోజులు బ్రేక్ వచ్చిన విషయం తెలిసిందే. శని, ఆదివారాలు ఆమె పాదయాత్ర చేయకుండా విశ్రాంతి తీసుకుంటున్నారు. శనివారం వైద్యులు షర్మిలను పరీక్షించారు.

కుడికాలు చిప్పకు బలంగా గాయం కావడంతో నొప్పి తీవ్రంగా ఉందని, కనీసం రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. విశ్రాంతి తీసుకోవడానికి షర్మిల అంగీకరించలేదు. శనివారం మధ్యాహ్నమే పాదయాత్ర సాగించేందుకు సిద్ధమయ్యారు. దీంతో షర్మిల తల్లి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, మరికొందరు కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు వారించడంతో ఆమె వెనక్కి తగ్గారు.

కాగా ఆమె పాదయాత్ర రద్దు అయిందని శనివారం సమన్వయ కమిటీ సభ్యులు తలశిల రఘురాం, కెకె మహేందర్ రెడ్డిలు చెప్పారు. రంగారెడ్డి జిల్లాలోని ఎల్బీ నగర్‌లో ఆమె పాదయాత్ర చేస్తున్న సమయంలో కాలు బెణికింది. షర్మిల పాదయాత్ర శుక్రవారం నాడు 57వ రోజుకు చేరుకుంది. శుక్రవారం రాత్రి 8 గంటలకు ఇంజాపూర్ చేరుకుని అక్కడ బస చేశారు. షర్మిల శుక్రవారం 16.30 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.

ఇప్పటి వరకు ఆమె పాదయాత్ర 824 కిలోమీటర్లు పూర్తయింది. శుక్రవారంనాడు ఆమె పాదయాత్ర రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, ఎల్బీ నగర్ శాసనసభా నియోజకవర్గాల్లో సాగింది. శని, ఆది వారాల విశ్రాంతి తర్వాత సోమవారం ఆమె పాదయాత్ర యథావిధిగా ప్రారంభమవుతుంది.

English summary

 YSR Congress party president YS Jagan's sister Sharmila padayatra stopped for the day on saturday, as she injured during the walk in Rangareddy district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X