పిక్చర్స్: రాధికతో కుమారస్వామి బర్త్‌డే వేడుక
బెంగళూరు: రాజకీయ నాయకుల జన్మదిన వేడుకలు కూడా రాజకీయాలకు వేదికగా మారుతాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి క్యూ కడుతారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి అటువంటి వేడుకలు జరుపుతునే ఏకాంతం వారికి లభించింది. కానీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి అటువంటి సందర్భాన్ని సృష్టించుకున్నారు.
ఆదివారంనాడు ఈ నెల 16వ తేదీన కుమారస్వామి 54వ పడిలో పడ్డారు. కుమారస్వామి పార్టీ నాయకులను, కార్యకర్తలను పక్కన పెట్టి తన కుటుంబ సభ్యులతో కలిసి జన్మదిన వేడుక జరుపుకున్నారు. కేక్ కట్ చేశారు. తన ఆనందాన్ని కుటుంబ సభ్యులతో పంచుకున్నారు.
కుమారస్వామి జన్మదిన వేడుక ముగ్గురికి మాత్రమే పరిమితమైంది. వారు కుమారస్వామి, నటి రాధికా కుమారస్వామి, వారి కూతురు షమిక. నటి రాధిక కేక్ తీసుకుని వచ్చిన తన భర్తతో కట్ చేయించారు. ఇతర పనులకు వెళ్లడానికి ముందు కుమారస్వామి తన భార్య, కూతురితో కలిసి కుమారస్వామి గడిపారు. కుమారస్వామి, రాధిక సంబంధంపై ప్రజల్లో ఎనలేని ఉత్కంఠ, ఆసక్తి కనిపిస్తూ ఉంటుంది. వారు కలిసి ప్రజల ముందుకు ఎప్పుడూ రారు. వారి సంబంధం ఏకాంత ప్రదేశాలకు, ఇంటికి మాత్రమే పరిమితమవుతూ వస్తుంది.

కుమారస్వామితో సంబంధంపై రాధిక చాలా కాలం దోబూచులాడుతూ వచ్చారు. మీడియాకు, ప్రజలకు అందకుండా వారిద్దరు తమ సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. మాజీ ముఖ్యమంత్రి, జెడి (ఎస్) రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామితో తనకు గల వివాహంపై రాధిక ఈ ఏడాది ప్రారంభంలో బయటకు వెల్లడించారు.

తాను కుమారస్వామిని చాలా ఆనందంగా తన జీవిత భాగస్వామిగా స్వీకరించానని, ఇందులో దాచుకోవాల్సిందేమీ లేదని నటి నుంచి నిర్మాతగా మారిన రాధిక అన్నారు.

కుమారస్వామి, రాధిక ఏడేళ్ల క్రితం ప్రేమవలలో పడ్డారు. 2006లో పెళ్లి చేసుకున్నారు. వారికి షమిక అనే మూడేళ్ల కూతురు ఉంది.

తమ సంబంధంపై చాలా కుమారస్వామి గానీ, రాధిక గానీ గోప్యత పాటించారు. ఓ ప్రముఖ కన్నడ పత్రిక 2010లో వారి సంబంధం గురించి, వారి కూతురు గురించి విషయాలను వెల్లడించిన తర్వాతనే వారు నోరు విప్పారు.

రాధిక కుమారస్వామి తన స్టీటీ సినిమా పనుల్లో తీరిక లేకుండా ఉన్నారు. ఈ సినిమాలో ఆదిత్య నటిస్తున్నాడు. విజయలక్ష్మి సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications