వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షర్మిల పాదయాత్ర తర్వాత కొనసాగుతుందా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Sharmila
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర విశ్రాంతి తర్వాత కొనసాగుతుందా, లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. షర్మిల మోకాలికి మంగళవారం హైదరాబాదులోని అపోలో ఆస్పత్రికలో విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. ఆమెకు ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు అంటున్నారు. విశ్రాంతి సమయంలో ఆమె ప్రతి రోజూ ఫిజియోథెరపి అవసరమవుతుంది.

చంచల్‌గుడా జైలులో వైయస్ జగన్‌ను కలిసిన తర్వాత ఆమె ఆస్పత్రికి వెళ్లి మెకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆరు వారాలు విశ్రాంతి అంటే, కనీసం నెలన్నర రోజులు ఆమె విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆరు వారాల తర్వాతనైనా ఆమె పాదయాత్ర కొనసాగుతుందా, లేదా అనేది అనుమానంగానే ఉంది. రంగారెడ్డి జిల్లాలో ఆమె పాదయాత్ర ఆగిపోయింది. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ఆమె పాదయాత్ర కర్నూలు, అనంతపురం, మహబూబ్‌నగర్ జిల్లాల మీదుగా రంగారెడ్డి జిల్లాకు చేరుకుంది.

ఆమె విశ్రాంతి తీసుకునే సమయంలోనే క్రిస్ట్మస్ పర్వదినం వస్తుంది. అలాగే, జనవరిలో సంక్రాంతి పర్వదినం వస్తుంది. ఒకవేళ ఆమె తిరిగి పాదయాత్ర కొనసాగించాలనుకుంటే సంక్రాంతి తర్వాతనే అవుతుందని అంటున్నారు. ఈలోగా పరిణామాలు ఏ దిశగా చోటు చేసుకుంటాయో తెలియదు.

నిజానికి, తనకు బెయిల్ వస్తుందని, బెయిల్ వచ్చిన తర్వాత తాను పాదయాత్ర చేస్తానని వైయస్ జగన్ తమ నేతలతో అప్పట్లో చెప్పారని అంటారు. ఈ విషయం కాస్తా బయటకు పొక్కి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్రకు శ్రీకారం చుట్టారని ప్రచారం సాగుతోంది. చంద్రబాబు పాదయాత్ర చేస్తుండడంతో వైయస్సార్ కాంగ్రెసు నుంచి పాదయాత్ర చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో తీవ్రమైన తర్జనభర్జనల తర్వాత షర్మిల పాదయాత్రకు నిర్ణయం జరిగింది.

షర్మిల పాదయాత్రపై నిజానికి, తెలంగాణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చాలా ఆశలు పెట్టుకున్నారు. పాదయాత్రతో పార్టీకి ఓ ఊపు రావడమే కాకుండా పలువురు నాయకులు పార్టీలో చేరుతారని అనుకున్నారు. అలా ప్రచారం కూడా సాగింది. ఇప్పుడు అర్థాంతరంగా షర్మిల పాదయాత్ర ఆగిపోవడంతో తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.

English summary
Debate is going on that wether YSR Congress party president YS jagan's sister continue her padayatra after 6 weeks rest or not. Surgery to her knee has been successfully completed at appollo hospital in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X