మంచు కొండల్లో ఉత్కంఠ.. గాల్లో 300 మంది ప్రాణాలు!

ఆకాశమే హద్దుగా సాగుతున్న పర్యాటకుల ఆహ్లాదకర ప్రయాణం క్షణాల్లోనే పీడకలగా మారింది. మంచు కొండల అందాలను తిలకిస్తూ గుల్మార్గ్ గోండోలా (కేబుల్ కార్)లో విహరిస్తున్న సుమారు 300 మంది పర్యాటకులు ఊహించని సాంకేతిక లోపంతో గాల్లోనే చిక్కుకుపోయారు. భూమికి వందల మీటర్ల ఎత్తున, మంచు గాలుల మధ్య ఏడు గంటల పాటు సాగిన ఈ జీవన్మరణ పోరాటం పర్యాటకులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. చివరకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం, సైన్యం, పోలీసులు మరియు ఎస్‌డీఆర్ఎఫ్ (SDRF) బలగాలు సంయుక్తంగా చేపట్టిన భారీ సహాయక చర్యలతో పర్యాటకులు సురక్షితంగా బయటపడటంతో కథ సుఖాంతమైంది.

గుల్మార్గ్ డెవలప్‌మెంట్ అథారిటీ (జీడీఏ) సీఈఓ తారిఖ్ హుస్సేన్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో గోండోలా మొదటి దశలో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో గుల్మార్గ్ నుండి 2,600 మీటర్ల ఎత్తులో ఉన్న కొంగ్‌దూరి (మొదటి దశ), అక్కడి నుండి 3,979 మీటర్ల ఎత్తులోని అఫర్వత్ శిఖరానికి (రెండో దశ) వెళ్లే రెండు కేబుల్ కార్ సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. ఊయలల్లా ఊగుతున్న క్యాబిన్లలో వందలాది మంది పర్యాటకులు చిక్కుకుపోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

Gulmarg Cable Car Failure 300 Tourists Trapped In Air Rescued Safely After 7 Hours Of Intense Operation

విషయం తెలిసిన వెంటనే జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన స్పందించింది. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తూ పర్యాటకులకు ధైర్యం చెప్పారు. "అన్ని క్యాబిన్లు సురక్షితంగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో శిక్షణ పొందిన రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. భయపడాల్సిన పనిలేదు" అని ఆయన భరోసా ఇచ్చారు.

సైన్యానికి చెందిన హై ఆల్టిట్యూడ్ వార్‌ఫేర్ స్కూల్ (HAWS), SDRF మరియు స్థానిక పోలీసులు రంగంలోకి దిగి సుదీర్ఘమైన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు స్థానిక పోనీవాలాలను సైతం రంగంలోకి దించారు. గాల్లో చిక్కుకున్న వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందిని హుటాహుటిన మోహరించారు. సోషల్ మీడియాలో ఎలాంటి పుకార్లను నమ్మవద్దని, పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని జమ్మూ కాశ్మీర్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+