"కటౌట్లు పెట్టుకుని సీఎంలైపోయారు"-నేను మాత్రం..విజయ్ పై పవన్ షాకింగ్..!
తమిళనాడులో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాదించిన పార్టీగా నిలిచిన టీవీకే అధినేత విజయ్ (Vijay) అనూహ్య పరిస్ధితుల మధ్య సీఎం అయిన తీరుపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan kalyan) అసూయ వ్యక్తం చేశారు. జనసేన పార్టీ నేతల సమావేశంలో మాట్లాడుతూ పవన్ విజయ్, టీవీకేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను 15 ఏళ్లుగా రోడ్లపై కష్టపడుతుంటే.. విజయ్ మాత్రం సింపుల్ గా సీఎం అయిపోయారని పవన్ వ్యాఖ్యానించారు.
ఈ మధ్య తమిళ రాజకీయాాలు చూస్తున్నానని, వాళ్లెంత సుఖంగా రాజకీయాలు చేశారో అని పవన్ కళ్యాణ్ కితాబిచ్చారు. తనకు అసూయ కలిగేంత సుఖంగా చేశారన్నారు. కటౌట్లు పెట్టుకుని గెలిచేశారన్నారు. తామూ అలాగే కటౌట్లు, హాలోగ్రామ్ లు పెట్టుకుండే బాగుండేదన్నారు. చక్కగా సీఎంలు అయిపోయేవాళ్లమన్నారు. తాను 15 సంవత్సరాలుగా రోడ్లమీద దేకించినా (తిప్పినా) కానీ సీఎంను చేయలేదన్నారు. తద్వారా ఏపీ ఓటర్లకూ, తమిళ ఓటర్లకూ తేడాను పవన్ గుర్తుచేశారు.

I’m jealous of #Vijay’s political victory. He won with cutouts and holograms itself, yet despite 15 years of my struggle, I have not experienced a victory of this magnitude.
— cinee worldd (@Cinee_Worldd) May 25, 2026
– #PawanKalyan pic.twitter.com/cfvuZ4Hd9l
కానీ మనం మానవత్వం గురించి ఆలోచించాలని ఏపీ రాజకీయాల్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఒక మాట మాట్లాడాలంటే చాలా అవగాహన కావాలన్నారు. తాను 15 ఏళ్ల పాటు ఎందుకు నలిగిపోయానంటే.. కొన్ని లక్షల మంది సమూహాల్ని ఏకతాటిపై నడిపించాల్సి వచ్చిందన్నారు. అయినా ఇంకా తాను డిప్యూటీ సీఎంగా మాత్రమే ఉన్నానని పరోక్షంగా ఆయన చెప్పుకొచ్చారు. కానీ విజయ్ మాత్రం ఇలా వచ్చి అలా కటౌట్లు, హాలో గ్రామ్ లతో షార్ట్ కట్ లో సీఎం అయిపోయారని పవన్ చెప్పకనే చెప్పారు. గతంలోనూ విజయ్ గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్.. తమిళ రాజకీయాలతో మనకు పోలిక లేదన్నారు. కాబట్టి తనను ఎవరూ విజయ్ తో పోల్చవద్దని కూడా కోరారు.












Click it and Unblock the Notifications