వాయలార్ రవి తెలంగాణ ఈజీ కాదన్నారు: పాల్వాయి

అయినా కూడా పార్టీ హైకమాండ్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆ విషయంపై ఆలోచిస్తున్నారని, కాబట్టి మీరు అనుకున్నంత ఈజీగా, ఇంత త్వరగా సెటిల్ కాదేమో అన్నారని అంతేకాని, తెలంగాణ రాదని ఎప్పుడూ చెప్పలేదన్నారు. 2014లో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని ప్రధానిని చేద్దామనుకున్నప్పుడు ఈ సమస్యను పరిష్కరించకుండా ఎన్నికలకు వెళితే కాంగ్రెస్ నష్టపోక తప్పదన్నారు.
కాగా తెలంగాణపై కాంగ్రెసు పార్టీ సానుకూల నిర్ణయం తీసుకోవడం కష్టమని కేంద్రమంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వాయలార్ రవి పాల్వాయికి తేల్చి చెప్పినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సోమవారం న్యూఢిల్లీలో రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కేంద్రమంత్రి వాయలార్ రవిని కలిశారు. ఈ సందర్భంగా పాల్వాయి తెలంగాణ అంశాన్ని త్వరగా తేల్చాలని, నిర్ణయం తెలంగాణకు అనుకూలంగా ఉండాలని వాయలార్ రవిని కోరారు.
ఈ సందర్భంగా పాల్వాయితో వాయలార్ తెలంగాణ అంశం తేల్చడం కష్టమని తేల్చేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణపై కాంగ్రెస్ సానుకూల నిర్ణయం ప్రకటించడం కష్టమేనని, ఈ అంశాన్ని తేల్చడం సులభమైన విషయం కాదని, దానితో అనేక అంశాలు, సమస్యలు ముడిపడి ఉన్నాయని పాల్వాయితో చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈ విషయాన్ని పాల్వాయి తెలంగాణ ఎంపీలకు చెప్పారని తెలుస్తోంది. మొదట తెలుగు దేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తెలంగాణపై తేల్చి చెప్పేలా ఒత్తిడి చేయాలని.. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం చెబితే రాష్ట్రం ఇవ్వకుండా నాన్చడం కాంగ్రెస్‌కు సాధ్యం కాదని కరీంనగర్ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ చెప్పారట. అయితే ఈ నెల 28వ తేది తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ ఎంపీలు సిద్ధంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications