హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్‌పై సురేఖ ఆత్మహత్య వ్యాఖ్య: సమర్థించిన కంచ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Konda Surekha-K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ప్రొఫెసర్ కంచ ఐలయ్య గురువారం మండిపడ్డారు. కెసిఆర్ పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. కెసిఆర్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ వస్తుందని కొండా సురేఖ చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలతో ఐలయ్య ఏకీభవించారు.

కెసిఆర్ తెలంగాణ పేరుతో రూ.50వేల కోట్లు సంపాదించారని మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఇడుపులపాయ ఉంటే కెసిఆర్‌కు ముడుపులపాయ ఉందని ధ్వజమెత్తారు. తెరాస అంటే ఉత్తర తెలంగాణ వెలమల పార్టీ అని ఎద్దేవా చేశారు. కెసిఆర్ తెలంగాణ సెంటిమెంట్ పేరుతో డబ్బులు సంపాదించుకుంటోందని ఆరోపించారు.

కాగా ఇటీవల కొండా సురేఖ, కల్వకుంట్ల చంద్రశేఖర రావులు ఒకరిపై మరొకరు చేసుకున్న విమర్శలు ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. కెసిఆర్ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ వస్తుందని కొండా సురేఖ అన్నారు. అందుకు తెరాస కార్యకర్తలు ఆమె ఇంటిని ముట్టడించారు. కొండా సురేఖ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఆ తర్వాత రోజు కెసిఆర్.. సురేఖ వ్యాఖ్యలపై స్పందిస్చూ.. అది పిచ్చితనమని, తనను అన్న వారే ఆత్మహత్య చేసుకోవాలని అన్నారు.

ఆయన వ్యాఖ్యలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మండిపడింది. వరంగల్ జిల్లా తెరాస పార్టీ కార్యాలయాన్ని ముట్టడించింది. అక్కడ పరిస్థితి లాఠీఛార్జ్ వరకు వెళ్లింది. అది హైదరాబాద్, కరీంనగర్ వైయస్సార్ కాంగ్రెసు, తెరాస పార్టీ కార్యాలయాలకు కూడా పాకింది. తాను ఆత్మహత్యకు సిద్ధమని, కెసిఆర్ కూడా ఆత్మహత్యకు సిద్ధమైతే సమయం, తేది చెబితే నేను వస్తానని బహిరంగ సవాల్ విసిరారు. అయితే ఆమె సవాల్‌కు కెసిఆర్ ఇప్పటి వరకు స్పందించలేదు.

English summary
Pro.Kanch Ilaiah has blamed TRS chief K Chandrasekhar Rao on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X