ఐఏఎస్‌లపై మళ్లీ టిజి వెంకటేష్ ఫైర్: మంత్రుల పైనా..

పని చేయని అధికారులు నిజాయితీగా ఉంటే లాభం లేదని, పని చేయకుండా నిజాయితీ అనే వారు సన్యాసి కిందే లెక్క అన్నారు. వ్యవస్థను ప్రక్షాళణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అధికారులు ఏమీ పట్టనట్లుగా ఉండటం భావ్యం కాదన్నారు. శిక్షణా తరగతులు ఇప్పించాల్సిందిగా తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి కోరుతానని చెప్పారు. కొందరు మంత్రుల పని తీరు కూడా ఇలాగే ఉందన్నారు.
పని చేయని అధికారుల వల్ల వ్యవస్త నిర్వీర్యమవుతోందన్నారు. అలాంటి వారు లేకపోయినా ఉన్నా ఒకటే అని ధ్వజమెత్తారు. మైనర్ ఇరిగేషన్ శాఖలో సిబ్బంది కొరత ఉన్న మాట నిజమే అన్నారు. సివిల్ ఇంజనీర్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని చెప్పారు. ఇప్పటికే తాము తమ శాఖలోకి 260 మంది ఇంజనీర్లను తీసుకున్నామని చెప్పారు. కాగా గతంలోనూ టిజి వెంకటేష్ ఐఏఎస్ అధికారులపై మండిపడ్డ విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications