తెలంగాణ ఇవ్వకపోతే నమ్మం, ప్రజల్లోకి వెళ్తాం: కెకె

తెలంగాణ ఇస్తే కాంగ్రెసు పార్టీ హ్యాట్రిక్ సాధిస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణ ఇస్తున్నట్లు సంకేతాలు ఇవ్వకపోతే తాము ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. గోదావరి నదిపై తలపెట్టిన పోలవరం ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని, అితే, 2.5 లక్షల మంది గిరిజనులు, 200 ఎకరాల మేర విస్తరించి ఉన్న గ్రామాలు ముంపునకు గురి కాబోవని ప్రభుత్వం చెప్పగలదా అని ఆయన అడిగారు.
సీమాంధ్రకు చెందిన ఆరుగురు కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు తెలంగాణకు అనుకూలంగా ఉన్నారని, సీమాంధ్ర ప్రజలు కూడా తెలంగాణకు అనుకూలంగా ఉన్నారని ఆయన చెప్పారు. అఖిల పక్ష సమావేశానికి అన్ని పార్టీలు వెళ్లి తెలంగాణపై అభిప్రాయం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ అఖిల పక్ష సమావేశంలో కాంగ్రెసు తన వైఖరి చెప్పకపోతే ద్రోహం చేసినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. అలా చెప్పకపోతే తెలంగాణకు కాంగ్రెసు వ్యతిరేకంగా ఉన్నట్లు సంకేతాలు వచ్చాయని అనుకోవచ్చునని, తెలంగాణ నాయకులంతా తెలంగాణపై కలిసికట్టుగా ఉండాలని ఆయన అన్నారు.
పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో సమైక్యవాదం పేరు ఎత్తకుండా చేశామని చెప్పుకున్నారు. తెలంగాణపై అవసరం లేకున్నా అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తున్నారని ఆయన తప్పు పట్టారు. తెలంగాణకు ప్యాకేజీలు తమకు అంగీకారం కాదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మరో ప్రత్యామ్నాయం లేదని అన్నారు. ఈ నెల 28వ తేదీన జరిగేదే తెలంగాణపై తుది సమావేశం కావాలని ఆయన అన్నారు. అన్ని పార్టీలు అభిప్రాయం చెప్పినా తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెసు ద్రోహం చేసినట్లేనని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రి కె. జానారెడ్డి, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. కాగా, కాంగ్రెసు తెలంగాణ సారథ్య బృందం గురువారం హైదరాబాదులోని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కలిసి తెలంగాణపై పార్టీ తన వైఖరి వెల్లడించాలని కోరారు.












Click it and Unblock the Notifications