వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెప్పేది చెయ్యమన్నమంత్రి: ఎన్టీఆర్ చెప్పారన్న స్వామి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Paripoornanda Swamy - Erasu Pratap Reddy
కర్నూలు: స్వర్గీయ నందమూరి తారక రామారావు తనకు స్వామి వివేకానంద స్ఫూర్తి ప్రదాత అని చెప్పారని శ్రీ పీఠం పరిపూర్ణానంద స్వామి బుధవారం అన్నారు. కర్నూలులోని రాజ్ విహార్ సర్కిల్ వద్ద స్వామి వివేకానంద విగ్రహాన్ని స్వామీజి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సత్యం, శీలం, ధర్మం, ధైర్యం కలిగిన అత్యున్నతమైన వ్యక్తి స్వామి వివేకానందుడని తెలిపారు. కెజి నుంచి పిజి వరకు వివేకానందుడి పాఠ్యాంశం ప్రవేశపెట్టాలని అన్నారు.

ఆధునిక సామాజిక విప్లవకారుడు స్వామి వివేకానందుడి విగ్రహాలను పార్లమెంట్, అసెంబ్లీ ఆవరణలో పెట్టాలన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ముఖ ద్వారాల్లో వివేకానంద విగ్రహాలను పెడితే మన నేతలు వారిని చూసి స్ఫూర్తి పొందుతారన్నారు. వివేకానంద స్వామి జాతి గొప్పదనాన్ని ఖండాంతరాల్లో చాటి చెప్పారన్నారు. మనకు మార్గదర్శనం చేసిన వారిని మర్చిపోవద్దన్నారు. భారత్ పూర్వ వైభవం పుణికి పుచ్చుకుంటుందని చెప్పారు.

స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా కర్నూలు మెడికల్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన యువజన సమ్మేళనంలో మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎదుటి వారికి చెప్పె విషయమేదైనా ముందుగా మనం ఆచరించి చెబితే దాని ప్రభావం ఉంటుందన్నారు. ఇదే విషయాన్ని వివేకానందుడు, రామకృష్ణ పరమహంస లాంటి మహానీయులు ఉద్భోరించారని చెప్పారు.

అయితే రాజకీయ నాయకులు ప్రజలకు చెప్పేది ఆచరించరని, తాము ఆచరించే విషయాలను బయటికి చెప్పరని అన్నారు. కాగా ఈ కార్యక్రమాలలో రామకృష్ణ మఠం ప్రతినిధి శితికంఠానంద స్వామి, విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు జి.రాఘవ రెడ్డి, నందికొట్కూరు, పాణ్యం శాసనసభ్యులు లబ్బి వెంకటస్వామి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, కలెక్టర్ సి.సుదర్శన్ రెడ్డి, రవీంద్ర విద్యా సంస్థల అధినేత జి.పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

English summary
AP's minister for Law, Erasu Pratap Reddy has said political leaders never told truths.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X