గుజరాత్ ఫలితాలు: బిజెపి ముందస్తు లీడ్

ఇది ముందుకు చూసే సమయమని, వెనక్కి తగ్గేది లేదని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. బిజెపికి మూడింట రెండు వంతుల మెజారిటీ వస్తుందని గుజరాత్ మాజీ హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఎన్ని సీట్లు తమకు వస్తాయనేది కాలమే చెబుతుందని కాంగ్రెసు నాయకుడు ఎ అగ్నీక్ అన్నారు. ఊహాగానాలు చేయడం సరి కాదని అన్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్ 4వ తేదీన పోలింగ్ జరిగింది. ఓటర్లు పెద్ద యెత్తున పోలింగులో పాల్గొన్నారు. బిజెపి, అధికార కాంగ్రెసు పార్టీలకు మధ్యకు నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉందని చెబుతున్నారు.
గుజరాత్‌లో నరేంద్ర మోడీ తిరిగి అధికారంలోకి వస్తారని, గతంలో కన్నా ఎక్కువ మెజారిటీ వస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించాయి. మోడీ హ్యాట్రిక్ దిశలో సాగుతుండగా, బిజెపిని కాదని సొంత కుంపటి పెట్టుకున్న కేశూభాయ్ పటేల్‌కు పరాభవం తప్పదని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications