నదిలో దూకి గాయని నిత్యశ్రీ భర్త ఆత్మహత్య

కారు ఆపాలని డ్రైవర్‌ను అడిగి, మహదేవన్ మొబైల్‌లో మాట్లాడుతూ దిగిపోయాడని సంఘటనా స్థలంలో ఉన్న పోలీసు చెప్పాడు. మహదేవన్ నదిలోకి దూకడాన్ని చూసినవారు ఫైర్, రెస్క్యూ సర్వీసుకు ఫోన్ చేశారని చెప్పాడు. సహాయక బృందం అధికారులు అతన్ని బయటకు తీసి ఒంటిగంటన్నర ప్రాంతంలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వార్షిక మర్గళి సంగీతోత్సవం జరుగుతున్న నేపథ్యంలో ఈ ఆత్మహత్య సంఘటన చెన్నై నగరాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఏడాది వివిధ సభలు నిర్వహిస్తున్న నిత్యశ్రీ గురువారం సాయంత్రం రామరావాు కళ్యాణ మండపంలో కచ్చేరీ చేయాల్సి ఉంది.
డికె పట్టమ్మాళ్ మనవరాలు అయిన నిత్యశ్రీ కర్ణాటక సంగీతంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఎంఎల్ వంసతకుమారి సరసన నిలబడుతారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు పోలీసులు నిత్యశ్రీ నివాసానికి చేరుకున్నారు. నిత్యశ్రీ మహదేవన్ దంపతుల కూతుళ్లను పాఠశాల నుంచి ఆ తర్వాత తీసుకుని వచ్చారు. వారు బోరుమని ఏడుస్తూనే ఇంటికి చేరుకున్నారు.












Click it and Unblock the Notifications