వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీలన్నీ ఆల్ పార్టీలో తెలంగాణ అనాల్సిందే: కోదండ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: అఖిల పక్ష సమావేశంలో అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలమని చెప్పాలని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ శుక్రవారం అన్నారు. కోదండరామ్ సహా జెఏసి నేతలు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. అఖిల పక్షంలో తెలంగాణకు అనుకూలంగా చెప్పాలని బొత్సను కోరినట్లు చెప్పారు.

అన్ని పార్టీలు కూడా అలాగే చెప్పాలన్నారు. తెలంగాణకు అడ్డుపడే వారికి వ్యతిరేకంగా తీవ్రంగా కార్యక్రమాలను రూపొందిస్తామన్నారు. అఖిల పక్షానికి తాను వెళ్లడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. కాంగ్రెసు పార్టీ 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలన్నారు. తమ అభిప్రాయాల్ని అధిష్టానం దృష్టికి తీసుకు వెళతానని బొత్స చెప్పారన్నరు. తెలంగాణ వ్యతిరేకులే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకుంటామన్నారు.

కాంగ్రెసు పార్టీ వాదనలు వినడం కాకుండా సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ నెల 28వ తేది తర్వాత తెలంగాణపై స్పష్టమైన ప్రకటన రాని పక్షంలో ఉద్య కార్యాచరణ తీవ్రతరం చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనను అఖిల పక్ష సమావేశానికి ఆహ్వానించారన్నారు.

ఇద్దర్ని పంపుతాం

ఈ నెల 28న జరిగే అఖిల పక్ష సమావేశానికి కాంగ్రెసు పార్టీ నుండి ఇద్దర్ని పంపిస్తామని బొత్స అన్నారు. 27న చర్చించి 28న వారిని పంపిస్తామన్నారు. ఇరు ప్రాంతాల నేతలు, టిజెఏసి నేతలు తమను కలిసి తమ వాదనలను వినిపించారని, దానిని అధిష్టానానికి నివేదిస్తానన్నారు. మంత్రి ధర్మాన ప్రసాద రావు ప్రాసిక్యూషన్ విషయంలో గవర్నర్ మరింత సమాచారం కోరారని చెప్పారు.

ఢిల్లీకి గవర్నర్

కాగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. ఈ నెల 28న తెలంగాణపై అఖిల పక్షం జరగనున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో పరిస్థితులు, ఎలాంటి వ్యూహం అనుసరించాలనే అంశాలపై ఆయన కేంద్రానికి నివేదిక అందచేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అఖిల పక్షంపై ఢిల్లీ పెద్దలతో ఆయన చర్చించే అవకాశాలున్నాయి.

English summary
Telangana Political JAC chairman has met PCC chief Botsa Satyanarayana on Friday and appealed him support Telangana in all party meet, which will held on 28th of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X