వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిట్టూ-ఫట్టూ: ఆత్మగౌరవంతో 'పార్టీ' చేసుకుంటున్నారు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గత పదిహేనుళ్లుగా ఆంధ్ర ప్రదేశ్‌లో పార్టీలు వెల్లువలా పుట్టుకు వచ్చాయి. ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో పుట్టుకు వచ్చింది. మరికొందరు నేతలు పార్టీలు పెట్టే యోచనలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి... వస్తున్నాయి. సమైక్యాంధ్ర కోసం ఏలూరు పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివ రావు, సీమ కోసం బైరెడ్డి రాజశేఖర రెడ్డి, తెలంగాణ కోసమంటూ నాగం జనార్ధన్ రెడ్డి పార్టీ పెడతారనే ప్రచారం జరిగింది... జరుగుతోంది.

పార్టీలు స్థాపించబోయే వారేమో కానీ రాష్ట్రంలో కొన్నేళ్లుగా పలువురు రాజకీయ పార్టీలు పెట్టి వాటిని విజయవంతంగా నడిపిస్తున్నారు. మరికొందరు వాటిని నడిపించలేక ఇతర పార్టీలలో విలీనం చేయడం జరిగింది. ఇంకొన్ని పార్టీల పరిస్థితి ఉన్నాయా అంటే ఉన్నాయి అన్న చందంగా తయారయింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు నుండి మొదలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వరకు ఆత్మగౌరవం, సెంటిమెంట్, అణిచివేతలను చూపించి పార్టీలను స్థాపించారు.

ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత కొన్నాళ్ల వరకు ఎలాంటి పార్టీ పుట్టుకు రాలేదు. అయితే ఆయన మృతి తర్వాత ఆయన పేరుతో మరో రెండు పార్టీలు ప్రధానంగా వెలుగులోకి వచ్చాయి. అన్న తెలుగుదేశం పేరుతో హరికృష్ణ, ఎన్టీఆర్ తెలుగుదేశం పేరుతో లక్ష్మీ పార్వతిలు పార్టీలు పెట్టారు. ఆ తర్వాత తెలంగాణకు అన్యాయం జరుగుతోందని కె చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు.

తెలంగాణ కోసమంటూ దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత ఆయన తన పార్టీని ప్రజారాజ్యంలో విలీనం చేశారు. 2008లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఆయన కూడా గతేడాది కాంగ్రెసు పార్టీలో పిఆర్పీని విలీనం చేశారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి మృతి తర్వాత వైయస్ కుటుంబాన్ని కాంగ్రెసు లక్ష్యంగా చేసుకుందని ఆరోపిస్తూ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నుండి బయటకు వచ్చారు.

ఆత్మగౌరవంతో 'పార్టీ' చేసుకుంటున్నారు!

తెలుగువాడికి అన్యాయం జరిగిందంటూ మూడు దశాబ్దాల క్రితం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. టిడిపిని తెలుగువాడి ఆత్మగౌరవ పార్టీగా ఆయన అభివర్ణించేవారు. ఇప్పటికీ టిడిపి నేతలు అదే చెబుతారు.

 ఆత్మగౌరవంతో 'పార్టీ' చేసుకుంటున్నారు!

ఎన్టీఆర్ మృతి చెందిన తర్వాత లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ టిడిపిని స్థాపించారు. కానీ అది పేరుకు మాత్రమే ఉంది. ఇటీవలే ఆమె ఆ పార్టీకి రాజీనామా చేసి జగన్ పార్టీలో చేరతానని చెప్పారు.

ఆత్మగౌరవంతో 'పార్టీ' చేసుకుంటున్నారు!

నందమూరి హరికృష్ణ అన్న టిడిపిని స్థాపించారు. 1999లో మెజార్టీ స్థానాల్లో పోటీ చేసింది. కానీ హరికృష్ణ కూడా గెలవలేకపోయాడు.

ఆత్మగౌరవంతో 'పార్టీ' చేసుకుంటున్నారు!

2001లో కె చంద్రశేఖర రావు సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందంటూ తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు. 2009 వరకు ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. వైయస్ మృతి తర్వాత ముఖ్యంగా 2009 డిసెంబర్ 9 ప్రకటన తర్వాత టిఆర్ఎస్ బాగా పుంజుకుంది.

 ఆత్మగౌరవంతో 'పార్టీ' చేసుకుంటున్నారు!

దేవేందర్ గౌడ్ ఐదేళ్ల క్రితం తెలంగాణ కోసమంటూ టిడిపిపై అసంతృప్తితో తెరాసకు పోటీగా నవ తెలంగాణ పార్టీని స్థాపించారు. కానీ అది మనలేదు.

ఆత్మగౌరవంతో 'పార్టీ' చేసుకుంటున్నారు!

2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. 2009 ఎన్నికల్లో 70 లక్షలకు పైగా ఓట్లను పొందారు. ఎన్టీఆర్ తర్వాత ఓ పార్టీ స్థాపిస్తున్నారంటే అంతగా స్పందన వచ్చింది చిరంజీవి పార్టీకే. కానీ మూడేళ్లు కూడా కాకుండా ఆయన కాంగ్రెసులో సామాజిక న్యాయం ఉందంటూ పిఆర్పీని అందులో విలీనం చేశారు.

 ఆత్మగౌరవంతో 'పార్టీ' చేసుకుంటున్నారు!

వైయస్ మృతి తర్వాత ఆయన కుటుంబాన్ని కాంగ్రెసు లక్ష్యంగా చేసుకుందని ఆరోపిస్తూ జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించారు. ఇప్పుడు ఆయన రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న టిడిపి, కాంగ్రెసు, టిఆర్ఎస్‌లకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.

ఆత్మగౌరవంతో 'పార్టీ' చేసుకుంటున్నారు!

ఇటీవల జాతీయ పార్టీ అయిన రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు రాష్ట్రంలో దాని వింగ్ తెలంగాణ రాష్ట్రీయ దళ్‌ను స్థాపించారు.

ఆత్మగౌరవంతో 'పార్టీ' చేసుకుంటున్నారు!

బిసి నేత కాసాని జ్ఞానేశ్వర్ మన పార్టీని స్థాపించారు.

గతేడాది ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించారు. ఆ తర్వాత తెలంగాణ కోసమంటూ ఇటీవల తెలంగాణ రాష్ట్రీయ లోకదళ్ పేరుతో కొత్త పార్టీ కూడా వచ్చింది. మధ్యలో మాజీ శాసనమండలి సభ్యుడు కాసాని జ్ఞానేశ్వర్ మన పార్టీని స్థాపించారు. ఆయన కూడా ఆ తర్వాత పిఆర్పీ వైపుకు వెళ్లిపోయారు. ఎన్టీఆర్ కంటే ముందు 1970లలో తెలంగాణ కోసం ఓ పార్టీ వచ్చినప్పటికీ ఇటీవల మాత్రం పార్టీల పైన పార్టీలు పుట్టుకొస్తున్నాయి.

ఒడిదుడుకులు వస్తున్నప్పటికీ కాంగ్రెసు, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు మాత్రమే ఇప్పటి వరకు ప్రధానంగా దూసుకుపోతున్నాయి. భారతీయ జనతా పార్టీ, సిపిఐ, సిపిఎం జాతీయ పార్టీలు అది వేరే విషయం. కాంగ్రెసు కూడా జాతీయ పార్టీ కానీ అది రాష్ట్రంలో ప్రధాన పార్టీగా ఉంది.

English summary
Anna Telugudesam, NTR TDP, Telangana Rastra Samithi, Prajarajyam, Nava Telangana, YSR Congress and Mana parties came in lost fifteen years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X