కథకు పట్టం: పెద్దిభొట్లకు సాహిత్య అకాడమీ అవార్డు

Peddibhotla Subbaramaiah
న్యూఢిల్లీ: ప్రముఖ తెలుగు కథా రచయిత పెద్దభొట్ల సుబ్బరామయ్య (75)కు కేంద్ర సాహిత్య అకాడమీ గురువారం సాహిత్య పురస్కారాన్ని ప్రకటించింది. వచ్చే ఫిబ్రవరిలో ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. గతంలో ఇలాంటి సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ రచయిత విశ్వనాథ సత్యనారాయణ, డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అందుకున్నారు. పెద్దిభొట్ల విజయవాడకు చెందినవారు.

ఆంధ్ర లయోలా కళాశాలలో 1957లో తెలుగు ట్యూటర్‌గా ప్రవేశించి తెలుగు అధ్యాపకునిగా, ఆపై డిపార్ట్‌మెంట్ హెడ్‌గా 1996లో అదే కళాశాలలో పదవీ విరమణ చేశారు. ఆయన తండ్రి రైల్వే స్టేషన్ మాస్టర్ కావటంతో ప్రాథమిక విద్యాభ్యాసం పలు ప్రాంతాల్లో జరిగింది. ఒంగోలు శర్మ కళాశాలలో ఇంటర్, విజయవాడ ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ప్రముఖ సాహితీవేత్త విశ్వనాథ సత్యనారాయణతో ఎంతో సాన్నిహిత్యం వుండేది. సుమారు 4 వందలకు పైగా కథలు రాసారు. వీటిలో వందకుపైగా ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి.

ధృవతార, ముక్తి, పంజరం, త్రిశంకువర్గం, కాలుతున్న పూలతోట వంటి 12 నవలలు రాశారు. తెలుగు, సంస్కృత భాషలపై ఎంతో పట్టు వుండగా రష్యన్ భాషపై కొంత మేర అవగాహన వుంది. పెద్దిభొట్ల రాసిన కొన్ని కథలు రష్యన్ భాషలో తర్జుమా అయ్యాయి. సాహిత్య అకాడమీ తనకు పురస్కారం ప్రకటించటం ఎంతో సంతోషంగావుందని పెద్ద్భిట్ల అన్నారు. రచయితలు ఎవరైనా గుర్తింపు కోరుకుంటారని ఇంతకంటే కావాల్సింది ఏముందని అన్నారు.

ఈ ఏడాది అనువాద పురస్కారం ఆర్.వెంకటేశ్వర రావుకు దక్కింది. బి.కె.శర్మ సంపాదకత్వంలో వెలువడిన 'ఎర్లీ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 500 బీసీ-624 ఏడీ' అనే పుస్తకాన్ని 'తొలి చారిత్రక ఆంధ్రప్రదేశ్' పేరుతో ఆర్ వెంకటేశ్వరరావు అనువదించారు. అనువాద పురస్కారంలో భాగంగా ఆయనను వచ్చే ఏడాది ఆగస్టులో రూ.50వేల నగదు, కాంస్యపతకం, దుశ్శాలువతో సత్కరిస్తారు.

ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు అధికంగా కవులకే లభించాయి. 20 కవితా సంకలనాలు, ఆరు కథా సంకలనాలు, నాలుగు నవలలు, ఒక ఆత్మకథ, ఒక విమర్శన గ్రంథానికి ఈసారి అవార్డులను ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+