చెప్పాల్సింది చెప్పాం: విజయమ్మతో భేటీపై కోదండరామ్

YS Vijayamma-Kodandaram
హైదరాబాద్: తెలంగాణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మకు తాము చెప్పాల్సింది చెప్పామని, ఆలోచిస్తామని చెప్పారని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ చెప్పారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసి నాయకుడు దేవీప్రసాద్‌తో కలిసి కోదండరామ్ శనివారం వైయస్ విజయమ్మను కలిశారు. ఈ నెల 28వ తేదీన ఢిల్లీలో జరిగే అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా ఒకే అభిప్రాయం చెప్పాలని ఆయన విజయమ్మను కోరారు.

ఈ నెల 28వ తేదీన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రతినిధులు చెప్పే వైఖరిని బట్టే తమ ప్రతిస్పందన ఉంటుందని, తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం చెప్పని పార్టీలను నిలదీస్తామని ఆయన విజయమ్మతో భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఇంతకు ముందు తెలంగాణ జెఎసి నాయకులు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కలిసిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కూడా వారు కలవాలని అనుకుంటున్నారు.

ఇదిలావుంటే, తెలంగాణకు అనుకూలంగా తమ పార్టీ నాయకత్వం అఖిలపక్ష భేటీలో నిర్ణయం చెప్పాలని కోరుతూ కాంగ్రెసు తెలంగాణ సారథ్య సంఘం తీర్మానం చేసింది. కాంగ్రెసు పార్టీ తలుచుకుంటే తెలంగాణ సాధ్యమవుతుందని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ అన్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే కాంగ్రెసు కనుమరుగు అవుతుందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తమకు తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై అపారమైన నమ్మకం ఉందని ఆయన చెప్పారు.

కాగా, తెలంగాణపై అఖిల పక్ష భేటీ వల్ల ప్రయోజనం ఏదీ ఉండదని కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ అన్నారు. ఈ అఖిల పక్ష సమావేశంలోనూ గతంలో జరిగిందే జరుగుతుందని ఆయన శనివారం విశాఖపట్నంలో మీడియాతో అన్నారు. అఖిలపక్ష సమావేశంలో కొత్త అంశాలేమైనా వస్తాయేమో చూడాలని అన్నారు.

అధిష్టానం పిలుపుతో ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శనివారం కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌ను కలిశారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యవహారంపై, ఈ నెల 28వ తేదీన తెలంగాణపై జరిగే అఖిలపక్ష భేటీపై ఆయన ఆజాద్‌తో చర్చించినట్లు సమాచారం. ఆ తర్వాత ఆయన కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిసి తెలంగాణపై నిర్వహించే అఖిల పక్ష సమావేశంలో మాట్లాడినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+