ఢిల్లీ రేప్: వెల్లువెత్తిన నిరసన, వాటర్ క్యానన్ల ప్రయోగం

వరుసగా ఆరో రోజు శనివారం ఢిల్లీలో నిరసనలు పెల్లుబుకాయి. మాజీ ఆర్మీ చీఫ్ వికె సింగ్ ఇండియా గేట్ వద్ద ఆందోళనకారులతో కలిశారు. శనివారం ఉదయం యువతీయువకులు ఇండియా గేట్ వద్ద గుమికూడి రాజ్‌పథ్ మీదుగా రైసినా హిల్స్‌లో గల రాష్ట్రపతి భవన్ వైపు మార్చ్ ప్రారంభించారు.
రాజ్‌పథ్ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను తోసుకుని ఆందోళనకారులు ముందుకు సాగారు. రైసినా హిల్స్ వద్ద పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. శుక్రవారం కూడా ఆందోళనకారులు రాష్ట్రపతి భవన్ వైపు దూసుకెళ్లడానికి ప్రయత్నించారు.
చాలా ఏళ్లుగా పోలీసు సంస్కరణలను ప్రభుత్వం అటకెక్కించిందని, తగిన సిబ్బంది లేరని పోలీసు కమిషనర్ చెప్పడం సిగ్గు చేటు అని వికె సింగ్ అన్నారు. రాజకీయ, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం సమస్యలకు కారణమవుతోందని ఆయన విమర్శించారు. పాలనా వ్యవస్థ వైఫల్యం వల్లనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications