ఢిల్లీ గ్యాంగ్ రేప్: ఔరంగబాద్‌లో ఆరో నిందితుడి అరెస్టు
న్యూఢిల్లీ: ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు ఆరో నిందితుడిని అరెస్టు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు శనివారం ఉదయం అతడ్ని అరెస్టు చేశారు. బీహార్‌లోని ఔరంగాబాద్‌లో అతడ్ని అదుపులోకి తీసుకుని, ఢిల్లీకి తరలించారు. నిందితుడి వివరాలు అందించడానికి పోలీసులు నిరాకరించారు.
అతన్ని పోలీసులు శుక్రవారం రాత్రి ఔరంగాబాద్‌లోని చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కౌశలేష్ కుమార్ సింగ్ ముందు హాజరు పరిచారు. దాంతో ఢిల్లీకి తీసుకుని వెళ్లడానికి పోలీసులకు మెజిస్ట్రేట్ అనుమతి ఇచ్చారు. ఔరంగబాద్ నుంచి రోడ్డు మార్గంలో అతన్ని వారణాసి తీసుకుని వచ్చారు. అదే రాత్రి అతన్ని విమానంలో ఢిల్లీకి తీసుకుని వచ్చారు.
అయితే, నిందితుడిని రైల్లో ఢిల్లీకి తీసుకుని వచ్చినట్లు తెలుస్తోంది. ఆ మార్గంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో నిందితుడితో పాటు పోలీసులు ఆలస్యంగా ఢిల్లీకి చేరుకున్నట్లు సమాచారం. బీహార్, ఢిల్లీ పోలీసుల సంయుక్త బృందం నిందితుడ్ని పట్టుకుంది. ఔరంగాబాద్ జిల్లాలోని తాండ్వా పోలీసు స్టేషన్ పరిధిలో గల లాహంకర్మా గ్రామంలోని ఇంటిలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

నిందితుడి తండ్రి సర్యుగ్ సింగ్ గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. నిందితుడి తండ్రిని, తమ్ముడు అభయ్ సింగ్‌ను బీహార్, ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు. వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి నిరసనగా విద్యార్థులు చేపట్టిన ప్రదర్శన హింసాత్మకంగా మారింది.












Click it and Unblock the Notifications