మావారు మంచివారు: నిత్యశ్రీ, మానసిక రోగి: పోలీసులు

Nithyashree
న్యూఢిల్లీ: తమిళనాడు రాజధాని చెన్నైలోని నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ప్రముఖ కర్ణాటక సంగీత కళాకారిణి నిత్యశ్రీ భర్త మహాదేవన్‌ను మానసిక రోగిగా పోలీసులు గుర్తించారు. గత ఐదేళ్ళుగా ఆయన మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టు వారు తేల్చారు. ఈ ఆత్మహత్య కేసులో కారు డ్రైవర్ సురేష్ వద్ద సేకరించిన ఆధారాలతో మహాదేవన్ మానసిక వ్యధతో బాధపడుతున్నట్టు వెల్లడించారు.

నిత్యశ్రీ భర్త మహాదేవన్ గత గురువారం స్థానిక అడయారు కూవం నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కొట్టూరుపురం పోలీసులు కేసు నమోదు చేసి చేపట్టిన దర్యాప్తులో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే తన భర్త చాలా మంచివాడని నిత్యశ్రీ అంటున్నారు. తనకు తన భర్తకు మధ్య ఎలాంటి విభేదాలు లేదా మనస్పర్థలు లేవని స్పష్టం చేసారు. తన భర్త మంచివాడని, ఇంతకుమించి తానేమీ చెప్పలేనంటూ బోరున ఏడ్చేసింది.

కారు ఆపాలని డ్రైవర్‌ను అడిగి, మహదేవన్ మొబైల్‌లో మాట్లాడుతూ దిగిపోయాడని సంఘటనా స్థలంలో ఉన్న పోలీసు చెప్పాడు. మహదేవన్ నదిలోకి దూకడాన్ని చూసినవారు ఫైర్, రెస్క్యూ సర్వీసుకు ఫోన్ చేశారని చెప్పాడు. సహాయక బృందం అధికారులు అతన్ని బయటకు తీసి ఒంటిగంటన్నర ప్రాంతంలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

వార్షిక మర్గళి సంగీతోత్సవం జరుగుతున్న నేపథ్యంలో ఈ ఆత్మహత్య సంఘటన చెన్నై నగరాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఏడాది వివిధ సభలు నిర్వహిస్తున్న నిత్యశ్రీ గురువారం సాయంత్రం రామరావాు కళ్యాణ మండపంలో కచ్చేరీ చేయాల్సి ఉంది. డికె పట్టమ్మాళ్ మనవరాలు అయిన నిత్యశ్రీ కర్ణాటక సంగీతంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఎంఎల్ వంసతకుమారి సరసన నిలబడుతారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు పోలీసులు నిత్యశ్రీ నివాసానికి చేరుకున్నారు. నిత్యశ్రీ మహదేవన్ దంపతుల కూతుళ్లను పాఠశాల నుంచి ఆ తర్వాత తీసుకుని వచ్చారు. వారు బోరుమని ఏడుస్తూనే ఇంటికి చేరుకున్నారు.

నిత్యశ్రీ, మహదేవన్ దంపతుల మధ్య మనస్పర్థలున్నాయని, ఆ కారణంగానే మహదేవన్ ఆత్మహత్య చేసుకున్నాయని వార్తలు వచ్చాయి. మహదేవన్ ఆత్మహత్య నేపథ్యంలో నిత్యశ్రీ కూడా ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు వార్తలు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+