వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా చెప్తే అంతే: తెలంగాణపై ఎంపి, జగన్‌పై విహెచ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rapolu Ananda Bhakar - V Hanumanth Rao
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటే ఎవరూ ఆపలేరని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ శనివారం అన్నారు. అణు బిల్లు, ఎఫ్‌డిఐల్లాగే కాంగ్రెసు తలుచుకుంటే తెలంగాణ ఏర్పాటు రాజ్యాంగ బద్దమవుతుందన్నారు. సోనియా ఇచ్చిన మాటను తప్పే వ్యక్తి కాదని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

తెలంగాణ ప్రకటిస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుందన్నారు. తెలంగాణ సారథ్య బృందం తరఫున పిసిసి మాజీ చీఫ్ నరసా రెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శులు నిరంజన్, నరసింహా రెడ్డి తదితరులతో కలిసి శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అఖిలపక్షం అత్యంత కీలకమైనదని, దీనిలో తెలంగాణ ఏర్పాటు అంశాన్ని జారవిడుచుకోవడానికి వీల్లేదని అన్నారు. సోనియా తలచుకుంటే అడ్డు చెప్పే వారెవరూ లేరని, ఆమె నిర్ణయానికి అడ్డుపుల్లలు వేసే నాయకులెవరని ప్రశ్నించారు.

2009 డిసెంబర్ 9న చరిత్రాత్మకమైన నిర్ణయం ప్రకటించినా, 28న జరిగే అఖిలపక్ష సమావేశంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ తన కచ్చితమైన నిర్ణయం ప్రకటించాలని వినమ్రంగా అర్థిస్తూ ఈ సమావేశం తీర్మానిస్తోందని వారు అన్నారు. కాంగ్రెసు సభ్యత్వ నమోదుకు ప్రజల్లోకి వెళితే తెలంగాణ గురించి నిలదీస్తారని వారికేం సమాధానం చెప్పాలని తాము పిసిసి అధ్యక్షుడు బొత్సను అడిగామన్నారు. నిర్ణయాన్ని సోనియాకు వదిలేశామని చెప్పమని బొత్స తమకు సూచించారన్నారు.

జైల్లో ఉండి ప్రజాసేవ చేస్తామన్న వారిని నమ్మొద్దని రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు వేరుగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. అధికారంలో ఉండగా లెక్క లేనట్టు అవినీతికి పాల్పడి.. జైల్లో ఊచలు లెక్కపెడుతున్న కొందరు ప్రజాసేవ చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని, అలాంటి వారిని నమ్మొద్దని పిలుపునిచ్చారు.

English summary
MP Rapolu Ananda Bhakar has responded on Telangana issue on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X