వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్యాంగ్ రేప్: టిక్కెట్టివ్వడం తప్పని బొత్సపై మోత్కుపల్లి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mothkupalli Narasimhulu
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు గత సాధారణ ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వడమే పెద్ద తప్పు అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు బుధవారం అన్నారు. మద్యం వ్యాపారులకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడం తప్పని, అలాంటిది ఏకంగా పిసిసి అధ్యక్షుడిని చేస్తే ఎంత ఘోరమైనా ఆయనకు చిన్నదిలాగే కనిపిస్తుందని మండిపడ్డారు.

బుధవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయ గౌడ్ అధ్యక్షతన ఢిల్లీ అత్యాచార సంఘటన- కేంద్ర ప్రభుత్వ వైఖరి అనే అంశంపై విస్తృత చర్చకు ఆయన హాజరయ్యారు. మోత్కుపల్లి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే మహిళలపై అరాచకాలు పెరిగాయన్న వాస్తవాన్ని యువత గమనించాలన్నారు.

ఢిల్లీలో జరిగిన విద్యార్థి ఉద్యమం యువత తలుచుకుంటే దేనినైనా సాధించగలదనే సత్యాన్ని చాటిందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే మహిళా సంక్షేమానికి పెద్ద పీట ప్రారంభమైందన్నారు. కాగా రెండు రోజుల క్రితం బొత్స విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఆడవారు సమయం సందర్భం చూసుకోవాలని, అర్ధరాత్రి ప్రయివేటు బస్సులో ప్రయాణించవద్దని సూచించారు. ఆ తర్వాత ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.

English summary
Telugudesam Party senior leader Mothkupalli Narasimhulu has lashed out at PCC chief Botsa Satyanarayana for his comments on women.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X