వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఖిల పక్ష సమావేశం: ఏ పార్టీ ఏం చెప్పింది?

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న ఎనిమిది పార్టీలు తెలంగాణపై తమ తమ అభిప్రాయాలను, కేంద్రాన్ని నిలదీయడం చేశాయి. అఖిల పక్ష సమావేశానికి ఎనిమిది పార్టీలకు పిలుపు వచ్చింది. కాంగ్రెసు, తెలుగుదేశం, బిజెపి, సిపిఐ, సిపిఎం, మజ్లిస్, టిఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల నుండి ఇద్దరు చొప్పున ప్రతినిధులు వెళ్లారు. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

బిజెపి - తెలంగాణకు అనుకూలం. 2009 డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి వెంటనే తెలంగాణ ఇవ్వాలి. కేంద్రం పార్లమెంటులో బిల్లు పెడితే బిజెపి సహకరిస్తుంది.

Telangana: All Parties opinion

టిఆర్ఎస్ - తెలంగాణ ఇవ్వాలి. డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి ఉండాలి. కేంద్రం తెలంగాణను నాన్చవద్దు.

తెలుగుదేశం - 2008లో కేంద్రానికి లేఖ ఇచ్చాం. దానిని వెనక్కి తీసుకోలేదు. అది మీవద్దే ఉంది. తెలంగాణను పరిష్కరించాల్సింది కేంద్రమే. 2008లో ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నాం. కాంగ్రెసు పార్టీ వైఖరిని కడియం శ్రీహరి నిలదీశారు. యనమల రామకృష్ణుడు లేఖ ఇచ్చారు.

సిపిఐ - తెలంగాణకు అనుకూలం. కేంద్రం సమస్యను సత్వరమే పరిష్కరించాలి.

సిపిఎం - సమైక్య నినాదం. సమస్యను త్వరగా పరిష్కరించాలి.

మజ్లిస్ - సమైక్యవాదం కాదంటే రాయల తెలంగాణ. సమస్యను వెంటనే కేంద్రం పరిష్కరించాలి

వైయస్సార్ కాంగ్రెసు - తెలంగాణ సెంటిమెంట్ గౌరవిస్తాం. కేంద్రంపై భారం వేసింది. స్పష్టమైన అభిప్రాయం చెప్పలేదు

కాంగ్రెసు - ఇద్దరు ప్రతినిధులు వేరువేరు అభిప్రాయాలు చెప్పారు.

English summary
he all-party meeting called by Home Minister Sushil Kumar Shinde to discuss the Telangana statehood issue has begun in New Delhi. It's a meeting that is being closely watched by Telugu people living not just in Andhra Pradesh, but all across the world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X