• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అత్యంత విషమంగా గ్యాంగ్ రేప్ బాధితురాలి ఆరోగ్యం

By Srinivas
|

India rape victim in Singapore: PM pledges action
సింగపూర్/న్యూఢిల్లీ: చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్ ద్వారా సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రికి తరలించిన న్యూఢిల్లీ రేప్ బాధితురాలు పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. అత్యంత విషమ పరిస్థితుల్లో ఇక్కడకు తీసుకు వచ్చారని సింగపూర్ వైద్యులు చెప్పారు. బాధితురాలిని బుధవారం సింగపూర్ తరలించారు. గురువారం ఉదయం ఆమెను మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రిలో చేర్పించారు.

ఆమె అత్యంత విషమ పరిస్థితుల్లో ఉన్నారని, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్పించామని రాత్రి ఏడు గంటలకు ఆస్పత్రి బులెటిన్ విడుదల చేసింది. వివిధ రంగాల్లో నిపుణులైన స్పెషలిస్టులు ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటున్నారని, ఆమెను సాధారణ స్థితికి తీసుకు రావడానికి శాయశక్తులా శ్రమిస్తున్నారని మౌంట్ ఎలిజబెత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ కెల్విన్ లోహ్ తెలిపారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని భారత హై కమిషన్ స్వయంగా పర్యవేక్షిస్తోందని ఆస్పత్రి అధికార ప్రతినిధి తెలిపారు.

గురువారం రాత్రి ఏడు గంటల సమయానికి బాధితురాలు అత్యంత విషమ పరిస్థితులో ఉన్నారని ఆసుపత్రి బులెటిన్ విడుదల చేసింది ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఆమెకు చికిత్స అందుతోందని, వివిధ విభాగాల ప్రత్యేక వైద్య నిపుణులు ఆమెకు చికిత్స అందిస్తున్నారని, ఆమె పరిస్థితి నిలకడగా ఉంచేందుకు వారు చేయగలిగిందందా చేస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ గ్యాంగ్‌రేప్ బాధితురాలికి సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స అందజేసిన సంగతి తెలిసిందే.

రోజురోజుకు పరిస్థితి విషమిస్తుండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెను సింగపూర్‌కు తరలించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. బాధితురాలికి అన్ని రకాల వైద్య చికిత్సలు అందిస్తున్నామని, ఆమె కుటుంబాన్ని అన్ని విధాలా సహకరిస్తున్నామని హై కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆమె వైద్యానికి అవసరమైన మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ఢిల్లీలో హోం మంత్రి షిండే ఓ ప్రకటనలో తెలిపారు. చికిత్సకు ఎన్ని వారాలు పట్టినా అన్ని రోజులూ ఆమె కుటుంబం అక్కడే ఉండడానికి అన్ని ఏర్పాట్లూ చేశామన్నారు.

ప్రధాని గ్యాంగ్‌ రేప్ దోషుల సంగతిని చట్టం చూసుకుంటుందని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డీసీ) 57వ సమావేశాన్ని ఉద్దేశించి గురువారం ఆయన మాట్లాడారు. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పిలుపునిచ్చారు. మహిళల భద్రతే తమ ప్రధాన బాధ్యతని, దేశ రాజధానిలో వారికి సంబంధించిన అంశాలపై కమిషన్ ఆఫ్ ఇంక్వైరీని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుత చట్టాలను పునఃసమీక్షించి, తీవ్రమైన లైంగిక నేరాలకు ఎటువంటి శిక్షలు విధించాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు.

మిస్టరీగా కానిస్టేబుల్ మరణం

ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్ సుభాష్ తోమార్ మృతి తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఆయన మరణం మిస్టరీగా మారింది. ఆందోళనకారుల దాడుల్లోనే ఆయన మరణించారని పోలీసులు చెబుతుంటే.. ఆయన గుండెపోటుతోనే చనిపోయారని ఆందోళనకారులు తేల్చి చెబుతున్నారు.

వెబ్ సైట్లో రేపిస్టుల పేర్లు

రేపిస్టుల పేర్లు, ఫొటోలు దేశవ్యాప్తంగా పోలీసు స్టేషన్లలోనూ బహిరంగ ప్రదేశాలోనూ, వెబ్ సైట్లలోనూ ప్రదర్శించనున్నట్లు హోంశాశ సహాయ మంత్రి ఆర్పీఎన్ సింగ్ అన్నారు. అత్యాచార దోషుల డాటాబేస్‌ను తయారు చేయాలని, వారి ఫొటోలు, వివరాలు, అడ్రస్ సేకరించి బయటపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పనిని చేపట్టాలని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరోని ఆదేశించినట్లు హోం శాఖ సహాయ మంత్రి ఆర్పీఎన్ సింగ్ తెలిపారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Indian Prime Minister Manmohan Singh pledged Thursday to take action to protest the nation's women while the young victim of gang rape on a New Delhi bus was flown to Singapore for treatment of severe internal injuries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more